New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
రెండు జతల పక్షులు(ఒక జత ప్రేమ❤️మరో జత వైరం) – 2

రెండు జతల పక్షులు(ఒక జత ప్రేమ❤️మరో జత వైరం) – 2

అందరు క్లాస్ కి వచ్చి కూర్చోగానే అప్పుడే లెక్చరర్ వచ్చారు…. అందరు పైకి లేచి కోరస్ గా గుడ్ మార్నింగ్ సార్ అని పెద్దగా అరిచారు…. అది విని ఆ సార్ అబ్బబ్బ ఏమి రెస్పెక్ట్ అబ్బా మీ అందరికి నేనంటే అని చెప్పి మీకు కూడా గుడ్డు మార్నింగ్ కూర్చోండి అందరు అని చెప్పి క్లాస్ స్టార్ట్ చేసారు….

ఇంక అందరు క్లాస్ ని సీరియస్ గా వింటూ ఉండగా మధ్యలో ఎస్క్యూజ్ మీ సార్ అని అంటూ అటెండర్ వచ్చి పిలిచారు…. అది చూసి కొంతమంది హమ్మయ్య బతికిచ్చాడు లేకపోతే ఇప్పుడు ఇదంతా వింటూ ఉంటే నిద్ర వచ్చేస్తుంది అని అనుకుంటూ ఉన్నారు…..
ఇంక ఆ లెక్చరర్ అటెండర్ ని చూసి ఏందయ్యా హనుమంతు ఇలా వచ్చావ్ ఏమైనా విషయం ఉందా అని అడిగారు చేతిలో ఎదో పేపర్ చూసి అవును సార్ ఇది ప్రిన్సిపాల్ గారు అన్ని క్లాస్ల్లోను ఇచ్చి రమ్మన్నారు అని చెప్పి ఇచ్చేసి వెళ్ళాడు….
ఇంక అది తీసి చూసి అందరి వైపు చూస్తూ హ్మ్ ఈ సర్కులర్ ఉద్దేశం ఏమనగా రేపే కదా మనకి కొత్త సంవత్సరం రాబోతుంది దాని కోసం అని మధ్యాహ్నం మీరంతా మీ క్లాస్లను డెకొరేషన్ చేసుకోవాలి అలాగే ఇప్పుడు ఉన్న ఈ రోజుల్లో మనకి ఎక్కడ చూసిన ఇది వరకు లాగా గ్రీటింగ్ కార్డ్స్ అనేవి కనిపించడం లేదు కదా…..
అందుకే మీరే మీకు ఇష్టం అయిన స్నేహితుల కోసం మీ ఫేవరెట్ లెక్చరర్స్ ఎవరో ఒకరు ఉంటారు కదా అని ఆ మాట అంటూ కాలర్ ఎగరేసుకుంటు వాళ్ళకి కూడా ఒక ప్రత్యేకమైన కార్డ్ ఒకటి తీసుకొని రావాల్సి ఉంటుంది….
మన ప్రిన్సిపాల్ సార్ గారికి ఇంకో ప్రత్యేకమైన కార్డ్ ఒకటి ఉండాలి ఈ విషయం లో ఒక పోటీ కూడా ఉండబోతుంది…. అది ఏంటంటే ఆ తెచ్చిన కార్డ్స్ లో ఏదైతే బాగుండిద్దో అంటే చూడగానే ఏదైతే అబ్బా బలే ఉందొ అనిపించిందో వాళ్ళకి ఒక బహుమతి ఇంక ఆ కార్డ్ ని ఫ్రేమ్ కట్టిచ్చి మన క్లాసుల్లోను ఇంక బయట ఒక షో పీస్ లా పెడతారు అనమాట…..
అది మొత్తం మూడు బహుమతులు ప్రైజెస్ కూడా ఏంటో ఇప్పుడే చెప్పేసారు….
ప్రధమ బహుమతి:అయిదు వేలు
ద్వితియ బహుమతి:మూడు వేలు
త్రితీయ బహుమతి:రెండున్నర వెయ్యి
ఇది విని అందరు చాలా ఆనందించారు ఎలాగ అయినా గెలవాలి అనే పట్టుదలతో ఉన్నారు అంతా….
ఇంక ఆ పూట క్లాసెస్ ఎలాగో ఒకలా అవ్వబుచ్చుకొని ఇంక మధ్యాహ్నం నుంచి అందరు డెకొరేషన్ లు చేసుకోవడానికి రెడీ ఐపోయారు…. అందరు ఎంతో హుషారుగా ప్రతి పని పంచుకొని చేసుకుంటూ పోతున్నారు….
అలా ఆరోజంతా ఎంతో హుషారుగా సరదాగా గడిచిపోయి అందరు ఎవరి ఇళ్లకు వాళ్ళు బయలుదేరి వెళ్తున్నారు ఒక్కొక్కళ్ళు గా ఇంక కొంతమంది మాత్రం మిగిలారు….
అందులో సూర్య చంద్రిక ఇద్దరు మిగిలారు…. చందు ఏమి ఆలోచిస్తున్నావే పోటీ గురించేనా అని అడిగింది ఒక అమ్మాయి అవునే ఎలాగ అయినా గెలవాలి ఫస్ట్ ప్రైజ్ గెలుచుకోవాలి దాని కోసం ఎలా చేద్దామా అని ఆలోచిస్తున్న అని చెప్పింది….
ఇంతలో అది విన్న సూర్య వచ్చి దాని కోసం అంత ఆలోచించడం ఎందుకె నీ కోతి ఫేస్ నే యాస్ ఇట్ ఈస్ పేపర్ మీద గీసి దాన్ని నీట్ గా మడిచి తావే సరిపోయిద్ది అది చూస్తే ఫస్ట్ రావడం పక్క కానీ ఫస్ట్ నుంచి కాదు లాస్ట్ నుంచి అని చెప్పి పక్కన ఉన్న ఇంకో ఫ్రెండ్ కి హైఫై ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోయారు….
చూసావే ఎంత పొగరు వాడికి ఇప్పుడు కాదు రేపు చెప్తా వాడి సంగతి అందరిలోకి ది బెస్ట్ తయారు చేసుకోచ్చి ఫస్ట్ ప్రైజ్ తీసుకునేటప్పుడు వాడి మొహం చూడాలి అప్పుడు ఉంటుంది మజా లేకపోతే నన్నే కోతి ఫేస్ అంటాడా ఉడతలు పట్టే మోహము వాడును అని తను కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయింది….
తన కూడా వస్తున్న ఫ్రెండ్ వీళ్ళ సంభాషణ అంతా విని వీళ్ళు వీళ్ళ గొడవ ఎప్పటికి మారతారో ఏంటో అని అనుకుంటూ వెళ్ళింది….అలా అందరు ఎదో ఒకలా కుస్తీ పట్టి గ్రీటింగ్ కార్డ్ తయారు చేసుకొని వచ్చారు….న్యూ ఇయర్ రోజు వచ్చింది అందరు విషెస్ చెప్పుకుంటూ తిరుగుతూ ఉన్నారు….
ఇంతలో అటెన్షన్ ఎవరిబడీ అందరికి ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు…. ఏంటి అందరు హ్యాండ్ మేడ్ కార్డ్స్ తయారు చేసుకొని వచ్చారా అని అడిగేసరికి అందరు ముక్త కంఠం తో యస్ అని అరిచారు అవి చూయిస్తూ….
హ్మ్ ఎందుకో ఈరోజు దీని గురించి ఇలా ఇవ్వాలని అనిపించింది…. మనం మన చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు థర్టీ ఫస్ట్ మధ్యాహ్నం నుంచి సరదా సరదాగా గడిపేస్తూ ఎవరి క్లాస్ రూమ్ లు వాళ్ళం డెకొరేషన్ చేసుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ ఆ రోజు గడిపేసే వాళ్ళం….
మారసటి రోజు స్కూల్ కి వెళ్లి గ్రీటింగ్ కార్డ్ ఆపిల్స్ అనో లేకపోతే ఇంకేదైనా ఫ్రూట్స్ అనో తీసుకెళ్లి టీచర్స్ కి ప్రిన్సిపాల్ కి ఇచ్చి వాళ్ళు ఇచ్చే బూందీ లడ్డు ప్యాకెట్ తెచ్చుకొని ఇంటికి వచ్చి సరదాగా అమ్మా వాళ్ళకి చూయించి తినేవాళ్ళం….
ఇప్పుడు ఉన్న ఈ పద్ధతుల్లో చాలా మార్పులు వచ్చాయి…. ఎదో మచ్చుకి చూసిన కూడా ఒక్క గ్రీటింగ్ కార్డ్ కూడా కనిపించడం లేదు ఇప్పుడు ఎదో తెలియని చిన్న వెలితి…..
ఒకప్పుడు ఎంతో బాగుండేది కదా అలా ఇప్పుడు లేదు అని అనిపించి మీ అందరికి కూడా మళ్ళీ మీ చిన్నప్పటి రోజులు గుర్తు చేయాలనే ఇలా మీ క్లాసులు డెకొరేషన్ చేసుకోవాలని ఇలా మీ అంతట మీరే ఒక కార్డ్ తయారు చేసుకు వచ్చి మళ్ళీ మీకు అలా ఆనాటి సరదాలు గుర్తు చేయాలనే ఈ రోజు నా ఈ చిన్న ప్రయత్నం అని చెప్పి అందరి కార్డ్స్ మీద వారి వారి పేర్లు రాయించి వాటిని ఒక ఎక్సహిబిషన్ లాగా పెట్టించారు….
అలా మిగిలిన ఫాకల్టీస్ అంతా వాటిని చూసి వాటిల్లో నుంచి ది బెస్ట్ అయిన కార్డ్స్ ఒక టెన్ సేలెక్ట్ చేస్తారు వాటిల్లో నుంచి ఒక త్రీ కార్డ్స్ నేను సెలెక్ట్ చేసి వాటికి అనౌన్స్ చేసిన విధంగా ప్రైజ్ మనీ డిస్ట్రిబ్యూట్ చేస్తాను….
సో అందరికి ప్రోసెస్ అర్ధం అయ్యింది కదా త్వరగా మీ పని మీరు మొదలు పెట్టండి అని అనగానే అందరు పెన్స్ తీసి నేమ్స్ రాసి అక్కడ అరెంజ్ చేసిన ప్లేసెస్ లో పెట్టేసి వచ్చి కూర్చున్నారు….
అంతా అలా ఐపోయాక మై డియర్ ఫాకల్టీ మెంబెర్స్ ప్లీజ్ గో ఏ హెడ్ అన్నారు…. అంతే అందరు వాటిని ఒక్కొక్కటి గా అబ్సర్వ్ చేస్తూ అందరు చూస్తూ ఒక పది నిమిషాల తర్వాత ఒక టెన్ కార్డ్స్ తీసుకోచ్చి ప్రిన్సిపాల్ గారికి ఇచ్చారు….
అది చూసి వాటిల్లో నుంచి ఒక త్రీ కార్డ్స్ పిక్ చేసుకొని మిగిలినవి పక్కన పెట్టేసారు…. ఇంక కింద కూర్చుని చూస్తున్న అందరికి ఒకటే టెన్షన్ మెయిన్ గా మన సూర్య బాబు కి ఇంక చంద్ర పాప కి వాళ్ళు ఒకటే మొక్కుకుంటున్నారు….
అది కూడా వాళ్ళకి రావాలని అనే దాని కన్న కూడా దేవుడా ప్లీజ్ నాకు రాకపోయినా పర్లేదు దానికి మాత్రం రాకూడదు అని సూర్య…. దేవుడా ప్లీజ్ దేవుడా ప్లీజ్ ప్లీజ్ ఒక వేళ నాది లేకపోయినా కూడా వాడికి మాత్రం రాకూడదు అని చంద్ర ఇలా ఇద్దరు మొక్కుకుంటూ ఉండగా….
మొదట థర్డ్ ప్రైజ్ అనౌన్స్ చేస్తున్న అని రితేష్ అని అనగానే ఒక అతను లేచి గర్వాంగా అందరి వైపు ఒక చూపు చూసి వెళ్లి మనీ తెచ్చుకొని స్టైల్ గా కూర్చుని సూర్య వంక చూసాడు….ది సెకండ్ ప్రైజ్ గోస్ టూ అంటూ ఉండగా ఇద్దరు కలిసి ఓ మొక్కేస్తూ ఉంటారు….
హ్మ్ ఎవరు విన్ అయ్యారు లేక ఇద్దరికి ఫస్ట్ వచ్చిందా అసలు ఇద్దరికి రాలేదా అని తెలియాలి అంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు ఆగల్సిందే….
అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు 😊
ఎదో నాకు అనిపించింది చెప్పాను ఒకప్పుడు బాగుండేది నాకు ఆ రోజులు గుర్తొచ్చాయి నిజంగా ఇప్పుడు పిల్లలకి అవేమి తెలియవు…. ఆ ఎంజాయమెంట్ ఇవన్నీ ఎంత బాగుండేవో నాకు అదంతా గుర్తొచ్చి ఇలా ఇచ్చాను ఏదైనా తప్పు ఉంటే దయచేసి మన్నించండే…..
అందరు మీ విలువైన రేటింగ్స్ ఇంక సమీక్ష లు ఇచ్చి ప్రోత్సాహిస్తారు అని ఆశిస్తూ….
మీ
లక్ష్మి అవినాష్.