రెండు జతల పక్షులు(ఒక జత ప్రేమ❤️మరో జత వైరం) – 3
ఇంక ప్రిన్సిపాల్ గారు రెండో విజేత ఎవరు అంటే అని ఆపి అందరిని చూసాడు…. అందరి మొహాల్లో టెన్షన్ కనపడుతుంటే ఇప్పుడు రెండోది చెప్పబోతున్న చెప్పేస్తున్నా అని గాయత్రి అనే పేరు చెప్పాడు….
ఆ మాటకి ఇద్దరికి బాధ వేసి మళ్ళీ ఎలాగో ఫస్ట్ నాదే కదా అనుకోని ఇద్దరు ధీమా గా చూస్తూ ఉన్నారు…. గాయత్రి అనే అమ్మాయి స్టేజ్ మీదకి వెళ్లి ప్రైజ్ తీసుకొని వచ్చింది….
ఇంక ఆ తర్వాత మొదటి విజేత ఎవరంటే అని చెప్పబోతుండగా ఇద్దరు ఒకరికి ఒకరు చూసుకొని చూస్తూ ఉండవే ఇది నాదే అని కాలర్ ఎగరేసాడు…. చంద్రిక చూసి ఏడ్చావ్ లే చూస్తూ ఉండు నేనే గెలుస్తాను అని హెయిర్ ని స్టయిల్ గా వెనక్కి వేసుకుంది…..
ఇంతలో ప్రిన్సిపాల్ గారు మాట్లాడుతూ ఫస్ట్ వచ్చింది ఒకరు కాదు ఇద్దరు అని చెప్పగానే అందరు ఆశ్చర్య పోయి చూస్తూ ఉంటారు…. ఇంక వీళ్ళిద్దరికీ ఉత్సాహం ఎక్కువ అయ్యి కచ్చితంగా ఆ ఒక్కరిలో నేను కూడా ఉంటా అని చూస్తూ ఉంటారు….
ఇంక ప్రిన్సిపాల్ గారు ది ఫస్ట్ విన్నర్ ఈస్ అని సూర్య చంద్రిక అని ఒకేసారి రెండు పేర్లు కలిపి అనౌన్స్ చేసేస్తారు…. ఇంక ఇద్దరు ఆనందం గా యస్ అనుకుంటూ లేచి ఒకళ్ళని ఒకళ్ళు చూసుకొని హైఫై ఇచ్చుకున్నారు….
అది చూసి అందరు ఆశ్చర్య పోతారు…. ఏంటి వీళ్లిద్దరు ఒకరికి ఒకరు ఎంకరేజ్ చేసుకున్నారా అని నోర్లు తెరిచి చూస్తుంటారు వీళ్ళ గురించి తెలిసిన వాళ్లంతా….ఇంతలో వాళ్ళు ఏమి చేసారో తెలుసుకొని చి చి అని చేతులు దులుపుకొని స్టేజ్ ఎక్కుతారు….
ఇంక అలా ఇద్దరు వెళ్లి స్టేజ్ ఎక్కి ప్రిన్సిపాల్ గారి పక్కన నుంచుంటారు…. కంగ్రాట్యులేషన్స్ మిస్టర్ అండ్ మిస్ సూర్య చంద్రిక అని వాళ్ళ కార్డ్ చూయించి ఇద్దరు అచ్చు ఒకేలాంటి కార్డ్ తయారు చేసారు…. అది అన్నిటిలోకి ఇవే ది బెస్ట్ అనిపించేంత అద్భుతం గా ఉంది అని చెప్పి దాన్ని ఇంకో కాపీ తీసుకొనిముందు చెప్పినట్టు అన్నిటికి అవి కనిపించేలా వాటిని డిస్ప్లే చేయమని చెప్పారు….
ఇంక ఇద్దరికి ప్రైజ్ మనీ ఇచ్చి మరొక్కసారి కంగ్రాట్స్ అని చెప్పి పంపించారు…. ఇంక అలా ఆ రోజు కొత్త సంవత్సరం కారణంగా కొన్ని మంచి మాటలు చెప్పి రిసోల్యూషన్స్ గురించి మంచి గా చెప్పి ఇంక ఆ రోజు ని అలా ముగించారు….
ఇంక అందరు ఇంటికి ప్రయాణం అయ్యారు…. ఐ యామ్ సో హ్యాపీ నా ఫస్ట్ ప్రైజ్ మనీ ఇది చాలా హ్యాపీ గా ఉందే అని చెప్పి అంటుంటడగా ఉంటుంది ఉంటుంది ఎందుకు ఉండదు నా ఐడియా ని కాపీ చేసి ఫస్ట్ ప్రైజ్ కొట్టేశావ్ కదే ఇంక హ్యాపీ కాక ఇంకెలా ఉంటావ్ లే అన్నాడు….
ఒరేయ్ అంట్ల వెధవ నేను నీ ఐడియా కాపీ కొట్టడం ఏంటి రా అసలు నీకు అంత సీన్ ఉందా నువ్వు చేసింది ఒక కార్డ్ మళ్ళీ నేను దాన్ని కాపీ కామెడీ చేయకు నవ్వలేకపోతున్న అని అంటుంటే….
ఒసేయ్ చపాతి మొహం దాన నువ్వే కాపీ చేసావే నా రూమ్ లోకి చూసుంటావ్ నేను చేసేటప్పుడు ఇంకేముంది యాస్ ఇట్ ఈస్ అలాంటిదే నువ్వు చేసేసి ఉంటావ్ అని అన్నాడు….
హా ఏమి మాట్లాడుతున్నావ్ రా యూస్ లెస్ డాంకీ నేను డాంకీ అయితే నువ్వు మంకీ వే నన్నే మంకీ అంటావ్ రా నువ్వే అడవి దున్న నేను దున్నని అయితే నువ్వు సీమ పందివి నువ్వు కంచర్ల గాడిదవి నువ్వు గున్న ఏనుగు….
నన్నే ఏనుగు అంటావ్ రా తోడేలు మోహమోడా నన్నే తోడేలు అంటావే నక్క మొహం దాన అని వాళ్ళ ఫ్లో లో అనుకుంటూ ఉండగా పక్కనే ఉన్న ఫ్రెండ్స్ ఇంక వినలేక ఆపండి ఎహె ఎప్పుడు చూసిన ఇలా కొట్టుకోవడం ఏ నా మీకు ఇంకో పని లేదా ఇద్దరు గెలిచారు కదా దానికి ఆనంద పడక ఏంటి ఈ గోల అని అరిచింది….
ఇంక ఇద్దరు కామ్ అయ్యేసరికి పక్కనే ఉన్న విష్ణు వచ్చి అదే కదా రమ్య ఏంటో పిల్ల గొడవలు వీళ్ళు అని భుజం మీద చేయి వేసి మన లాగా ఉండడం వీళ్ళకి రాదు అని అంటాడు…. ఆ అమ్మాయి భుజం మీద నుంచి చేయి తీసి నువ్వు నేను ఒకటి ఏంటి రా జిలేబి మోహమోడా ఇంకోక్కసారి ఇలా భుజాల మీద చేతులు వేసి మాట్లాడవో….
ఆ చేయి అంత వరకు నరికేస్తా జాగ్రత్త అని చెప్పి చంద్రిక ని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది….ఇంక పక్కన ఉన్న అందరు పెద్దగా నవ్వుకొని బాగా అయ్యిందా అని ఎగతాళి చేసారు….
హ్మ్ సరేలే పదండీ రా అయినా అది నీది కాపీ కొట్టింది అంటావా రా అని అడిగాడు అనిల్ అనే అతను…. సూర్య పెద్దగా నవ్వి అది నాది కాపీ కొట్టడం ఏంటి రా నేనే దానిది అచ్చు గుద్దినట్టు దింపాను అని అన్నాడు….
అందరు అది విని ఆశ్చర్య పోయి అది ఎలా రా అని అడిగేసరికి అలా అని ఎదో మూవీ లా చూయిస్తునట్టు చేతిని అలా అని ముందుకు చూయించాడు…. అది ఎలానో నేను మీకు చెప్తాను….
కాకపోతే ఇప్పుడు కాదు నెక్స్ట్ ఎపిసోడ్ లో ఎలా కాపీ చేసాడు అనేది తెలుసుకోవడానికి మీరు రెడీ గా ఉన్నారా….
అయితే నెక్స్ట్ పార్ట్ కోసం ఎదురు చుడండి….
అంత వరకు మీ విలువైన రేటింగ్స్ ఇంక సమీక్ష లని ఇచ్చి నన్ను ప్రోత్సాహిస్తారు అని ఆశిస్తూ….
మీ
లక్ష్మి అవినాష్.
Swipe left/right or tap the sides to turn pages