వలయం -18
“రెండు రోజులు తర్వాత తను నా దగ్గరకు వచ్చి నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా నీ మనసులో ఉన్న ప్రేమని ఆ గేమ్ లో నిజంగానే బయట పెట్టావు కదా అని అడిగితే,, నేను కాదు అని చెప్పలేకపోయాను. అలా ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది, ఆ తర్వాత కాలేజీలో ఇద్దరం సరదాగా సినిమాలకి షికారులకి వెళ్ళాం. లైఫ్ చాలా బాగా ఎంజాయ్ చేసాం ఆ టైంలో” అని అన్నాడు ఉదయ్.
“ఓకే క్యూట్ లవ్ స్టోరీ. ఓకే మిస్టర్ ఉదయ్ మీ మరదలు ఎక్కడ ఉన్నా మేము వెతికి పెట్టుకుంటాం” అని చెప్పాడు ప్రమోద్.
ఒకేసార్ ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వెతకండి అని చెప్పి ఉదయ్ స్టేషన్ నుంచి బయటికి వచ్చిన వాడు ఏదో గుర్తుకు వచ్చినట్లుగా పరిగెత్తుకుంటూ వెనక్కి వచ్చి “సార్ నా భార్య నిధి బాడీ అని చెప్పటానికి కూడా అతని మాట రాక హాస్పిటల్ మార్చురీ అని చిన్నగా అడిగాడు. అంతకుమించి అతని గొంతులో బాధ క్లియర్ గా తెలుస్తుంది..
“మాధురి హాస్పిటల్ మార్చురీలో ఉంది మీరు వెళ్లి నా పేరు చెప్పండి అలానే కేసు నెంబర్ చెప్పండి” అని కొన్ని వివరాలు ఉదయికి చెప్పాడు ప్రమోద్
ఓకే సార్ థాంక్యూ అని చెప్పే అక్కడినుంచి వెళ్ళిపోయాడు ఉదయ్..