New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
వలయం – 20
వలయం Premium 6 min read

వలయం – 20

వలయం -20

 

“30 లక్షల కాదండి కోటి రూపాయలైనా సరే నేను మీకు ఇస్తాను, ముందు అంకుల్ ఆరోగ్యం గురించి మాత్రమే ఆలోచించండి ఇక ఏమీ ఆలోచించొద్దు” అని అన్నది కల్పన. 

 

కల్పనా నిజంగా మనీ ఇస్తుందో లేదో తెలియదు కానీ ఆ మాట అన్నందుకు మాత్రం ఆమె సంతోష పడిపోయింది.. “చాలా సంతోషం అమ్మ నువ్వు నా కూతురు ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ కానీ నా కూతురేమో మాకు దూరమైంది కానీ నువ్వు మాత్రం ఇలా మాకు సహాయం చేస్తున్నావ్, నీ రుణం ఎప్పటికీ మర్చిపోలేము” అని అన్నది. 

 

కల్పన చిన్నగా నవ్వి “సరే అంటీ అంకుల్ జాగ్రత్త” అని మరో ఐదు నిమిషాలు మాట్లాడి బయటికి వచ్చింది బయటే ఉన్న రాజేష్ ని చూసి ఒక అడుగు వెనక్కి వేసింది కల్పన. 

 

అతడు సూటిగా చేతులు కట్టుకొని ఆమె వైపే చూస్తుంటే ఆమె అతని వైపు చూడలేక ఇబ్బంది పడుతూ టెన్షన్తో చేతులు నలిపేసుకుంటూ నాలుగు అడుగులు ముందుకు వేసింది కల్పన. 

 

రాజేష్ ఆమె వెనకే నడుస్తూ వెళుతుంటే ఆమె అతడు చూపులకి భయపడుతూ పరిగెత్తినట్లే హాస్పిటల్ నుంచి బయటకు వచ్చింది.

ఆమెను వదిలిపెట్టకుండా ఆమెనే అనుసరిస్తూ వచ్చిన రాజేష్ ఆమె చేతిని పట్టుకొని ఆపి “నువ్వు నిధి ఫ్రెండ్ కదా” అని సీరియస్గా అడిగాడు.. 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue