వలయం -21
రాజేష్ నవ్వుతూ లోపలికి వచ్చి “ఏం లేదు మనీ ఇన్సూరెన్స్ కోసం అప్లై చేశారు కదా, పేపర్స్ అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయి మీకు మనీ మరో 10 డేస్ లో వస్తాయి అని ఉదయం ఫోన్ చేయాలి అనుకున్నాను. కానీ అనుకోకుండా మా అమ్మకి హెల్త్ బాగోలేకపోవడంతో హాస్పిటల్కి తీసుకొని వెళ్లాల్సి వచ్చింది. అందుకే మీకు ఇంఫాం చేయలేకపోయాను. ఈ గుడ్ న్యూస్ ని నేనే డైరెక్ట్ గా ఇంటికి వచ్చి చెప్తే బాగుంటుంది అని వచ్చాను” అని అన్నాడు.
“ఓ అవునా? అయితే త్వరలోనే నిధి కోరిక నెరవేరబోతుంది అన్నమాట” అని సంతోషంగా చెప్పాడు ఉదయ్.
“అవునా, నిధి చనిపోయినట్టుగా నిధి పేరెంట్స్ కి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అని విన్నాను. నిజమేనా..! పాపం కూతురు చనిపోతే పేరెంట్స్ కి చెప్పకపోవడం కరెక్ట్ కాదు కదా ఉదయ్” అని అడిగాడు రాజేష్..
“చెప్పాలి అని నాకు ఉంది కానీ పెళ్లయిన తర్వాత ఇప్పటివరకు ఒక్కసారి కూడా తను తన పేరెంట్స్ దగ్గరకి వెళ్ళలేదు, వాళ్ళు మా దగ్గరకు రాలేదు. ఫోన్ చేస్తుంటే మాకు ఫోన్ చేయొద్దు అని ఎప్పుడు ఫోన్ కట్ చేసేవాళ్ళు. ఇప్పటివరకు మా మీద కోపంగా ఉన్నారు ఇక పైన కూడా అదే కోపంగా ఉంటారు కదా, నిధి చనిపోయింది అని తెలిస్తే వాళ్ళు బాధపడతారు అందుకే చెప్పలేదు” అని అన్నాడు రాజేష్..
“అవునా నిజమే లేండి, దూరంగా ఎక్కడో ఉంది అని అనుకునే సంతోషం కంటే చనిపోయింది అనే బాధ ఎక్కువగా ఉంటుంది” అని బాధగా ఫేస్ పెట్టి చెప్పి, “మీరు ఏదో బిజినెస్ పెట్టాలి అని అంటుంటే విన్నాను ఇంతకీ ఏ బిజినెస్ తెలుసుకోవచ్చా నేను” అని నార్మల్గా అడిగాడు రాజేష్..