New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
వలయం – 23
వలయం Premium 6 min read

వలయం – 23

వలయం -23

 

 

“తెలుసు తెలుసు.. అది ఉదయ్ వాళ్ళ ఊరు, కానీ నిధి అక్కడ ఎందుకు ఉంటుంది. తను ప్రమాదంలో ఉన్నట్లు త్వరగా వచ్చే కాపాడమని ఎందుకు చెప్తుంది.. అంటే ఉదయ్ ఆమెను కిడ్నాప్ చేశాడా..? కానీ అలా చేసే ఛాన్స్ లేదు. ఉదయ్ కి నిధి అంటే ప్రాణం. అలాంటిది అతను ఎందుకు చేస్తాడు. ఒకవేళ నిధిని ఉదయ కిడ్నాప్ చేసి ఉంటే నాకు ఫోన్ చేసినప్పుడే నన్ను ఉదయ్ కిడ్నాప్ చేశాడు అని నిధి చెప్తుంది కదా, కానీ అలా చెప్పలేదు అంటే ఉదయ్ కిడ్నాప్ చేయలేదనుకుంటా, అసలు ఏం జరుగుతుంది” అని అయోమయంతో తల పట్టుకొని అన్నది కల్పన.

 

“నువ్వు అనుకుంటున్నట్లు ఆ ఉదయ్ అంత మంచివాడు ఏమీ కాదు” అని చెప్పి అతను బైక్ ఎక్కి స్టార్ట్ చేశాడు.

 

“నువ్వేం మాట్లాడుతున్నావో నాకు ఏమీ అర్థం కావడం లేదు, ఉదయ్ మంచివాడు కాకపోవడమేంటి..?”, అని అడిగింది కల్పన. 

 

“ఇప్పుడు నిధి ఉదయ్ వాళ్ళ ఊరు అయినా కొండపల్లి లో ఉంది అంటే నాకెందుకో దీని వెనక కచ్చితంగా ఉదయ్ ఉంటాడు అనిపిస్తుంది. అతడు ఎందుకు చేశాడు ఏంటి అనేది నాకు ఒక క్లారిటీ లేదు కానీ నాకైతే అతడి మీద అనుమానం ఉంది” అని అన్నాడు రాజేష్.. 

 

“నువ్వేం మాట్లాడుతున్నావ్ ఉదయ్ మీద అనుమానం ఉండటం ఏంటి? అసలు ఎందుకు నీకు అనుమానం వచ్చింది..?” అని అడిగింది కల్పనా..

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue