New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
వలయం – 24
వలయం Premium 6 min read

వలయం – 24

వలయం -24

 

“ఇప్పటికే దాదాపు నెల రోజులు అవుతుంది, ఎవరికీ తెలియకుండా సీక్రెట్ గా నీకు భోజనం తీసుకొని రావటం నీకు ఇవ్వటం, ఈ రూమ్లో నువ్వు పారిపోకుండా బంధించడం కష్టమైపోతుంది. చదువుకున్న అమ్మాయి తెలివిగల అమ్మాయివి కదా నీ ముందు జాగ్రత్తగానే ఉండాలి.. లేదంటే చాలా కష్టం. అయినా ఈ కష్టం నీకెందుకు హ్యాపీగా పక్కకు తప్పుకో..

 

నువ్వు మధ్యలో రాబట్టే నా కూతురు అల్లుడు ఇద్దరు పెళ్లి జరగలేదు. అదే నువ్వు మధ్యలో లేకుండా ఉంటే వాళ్ళిద్దరి పెళ్లి జరిగేది. వాళ్ళ పెళ్లి నీ కళ్ళముందే చేస్తాను అయినా ఉదయ్ ఉదయ్ అంటావేంటి.. ఆ ఉదయ్ నా కూతుర్ని పెళ్లి చేసుకుంటాను అని మాట కూడా ఇచ్చాడు.. ఇంకా అతడు నీ ఉదయ్ కాదు నా కూతురి భర్త ఉదయ్.. నువ్వు ఉదయ్ ని మర్చిపో, అప్పుడే నువ్వు  సేఫ్ గా ఉంటావు. లేదంటే ఏం జరుగుతుందో నేను చెప్పలేను..  త్వరలోనే వాళ్ళిద్దరికీ పెళ్లి జరుగుతుంది. వాళ్ళిద్దరూ వచ్చిందాకా గోరింకల సంతోషంగా ఉంటారు. కాబట్టి  ఇప్పటికైనా ఉదయ్ మీద ఉన్న ఆశలని వదిలేసుకొని బ్రతుకు, అప్పుడు నువ్వు సంతోషంగా ఉంటావ్ మేము సంతోషంగా ఉంటాము” అని అన్నాడు రమ్య తండ్రి, ఉదయ్ మేనమామ అయిన సుబ్బారావు… 

 

“లేదు నువ్వు నాకు అబద్ధం చెప్తున్నావు, ఉదయ్ కి నేనంటే ప్రాణం. నన్ను కాదు అని మరో ఆడదాని వైపు చూడడు. పెళ్లి చేసుకోవాలి అన్న ఆలోచన కూడా చేయ్యడు, రమ్య తన మరదలు అయ్యుండవచ్చు కానీ రమ్య మీద ఉదయ్ కి ప్రేమ లేదు, నన్ను మాత్రమే ప్రేమించాడు” అని ఉదయ్ మీద ఉన్న నమ్మకంతో చెప్పింది నిధి. 

 

సుబ్బారావు గట్టిగా నవ్వుతూ “నువ్వు ఆ నమ్మకంతోనే జీవితాంతం బ్రతికేసేయ్, కానీ అక్కడ నా కూతురు అల్లుడు హ్యాపీగా బ్రతికేస్తారు. ఒక్కసారి వాళ్ళిద్దరికీ పెళ్లి జరిగిన తర్వాత ఇక నువ్వు ఏమి చేయలేవు. అందుకే నువ్వు చనిపోలేదు బ్రతికే ఉన్నావు అనే విషయం నా అల్లుడికి ఇప్పటివరకు చెప్పలేదు,

 

ఒకవేళ చెబితే కచ్చితంగా నా అల్లుడు నిన్ను చంపేయమంటాడు అని తెలుసు. కానీ నాకు ఒక కూతురు ఉంది నువ్వు కూడా నా కూతురు అంతా వయసు ఉన్న ఆడపిల్లవి. నాకు ఆడపిల్లని చంపాలి అన్న దురుద్దేశం లేదు, కాకపోతే నా అల్లుడికి నా కూతురికి పెళ్లి చేయాలి అన్న ఆలోచన మాత్రమే ఉంది. చిన్నప్పటినుంచి నా అల్లుడు మీదే నా కూతురు ప్రాణాలు పెట్టుకుని బ్రతికింది. 

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue