వలయం -26
చుట్టూ ఉన్న నలుగురు వాళ్ళ చుట్టూ చేరి” మా ఊరికే వచ్చి దొంగతనం చేయాలి అనుకుంటారా..?” అని వాళ్ళ మీద అటాచ్ చేస్తుంటే,
రాజేష్ మేము దొంగలం కాదు అని వాళ్లకు అర్థమయ్యే విధంగా చెప్పాలి అనుకున్నాడు.
కానీ వాళ్ళు రాజేష్ మాట వినలేదు వాళ్ళ మధ్య గొడవ జరిగింది.
రాజేష్ అది కష్టం మీద వాళ్ళందరినీ కొట్టేసి నిధి ఫేస్ మీద పక్కన పారుతున్న కాలవలో ఉన్న నీళ్లు తీసుకొని వచ్చి పోసాడు.
ఆమె చిన్నగా కళ్ళు తెరిచి మూస్తూ ఉండటంతో ఆమె ఇప్పుడు లేవలేదు అని అర్థం చేసుకొని ఆమెను రెండు చేతులతో ఎత్తుకొని బైక్ వరకు తీసుకొని వచ్చాడు రాజేష్.
నిధిని జాగ్రత్తగా పట్టుకోమని కల్పనాకి చెప్పి తన బైక్ ఎక్కి బైక్ స్టార్ట్ చేశాడు.
వెనక నిధిని కూర్చోబెట్టి ఆ వెనక కల్పనా నిధి కింద పడకుండా జాగ్రత్తగా పట్టుకొని కూర్చుంది.