వెనక్కి చూసుకుంటూ లోపలికి పరిగెత్తుకొచ్చిన గాయత్రి తన కోసం బయటికి వస్తున్న అత్తకి తగలడంతో అమ్మా అని చిన్నగా కేక వేసి కింద పడిపోవడంతో ఎందుకే అలా ఎవరో తరుముతున్నట్టుగా పరిగెత్తుకొచ్చావ్ అని అడిగింది ఆవిడ చెయ్యి అందించి….
గాయత్రి కంగారు పడుతూ ఏమీ లేదు…. బయట కుక్క ఉంది అనగానే కుక్కని చూసి భయపడ్డావా అని వాళ్ళందరూ నవ్వుతూ ఉండడంతో ఇబ్బందిగా నవ్వి వెళ్లి సోఫాలో కూర్చుంది…..
ఇదిగో మీ మావయ్య నీకోసం ఒకటే కలవరిస్తున్నాడు అంటూ బాదం పప్పు జీడిపప్పు పిస్తా ఒక ప్లేట్లో వేసి స్వీట్ కూడా ఇవ్వడంతో అవి నెమ్మదిగా తింటూ బయటికి చూస్తోంది…..
ఆ తర్వాత వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ అక్క ఇద్దరు వంటగదిలోకి వెళ్ళిపోతే ఎవరో ఫోన్ చేయడంతో గాయత్రి వాళ్ళ మావయ్య కూడా గదిలోకి వెళ్లడంతో వాళ్ళు ఎవరికీ తెలియకుండా నెమ్మదిగా బయటికి వచ్చింది….
ఈసారి అతను ఇంటి ముందు బైక్ ఆపి కనిపించడంతో కంగారుగా కళ్ళు పెద్దవి చేస్తే అతని చుట్టూ బెల్లం చుట్టూ ఈగలు చేరినట్టుగా చేరి ఆటోగ్రాఫ్ కావాలి ఫోటోగ్రాఫ్ కావాలి అని అడుగుతూ ఉండడంతో అతని మొహం లో అసహనం క్లియర్గా తెలుస్తోంది…..
కాసేపటికి ఒక నలుగురు బౌన్సర్లు అక్కడికి వచ్చి వాళ్ళు అందరినీ బలవంతంగా అక్కడికి పంపించేసి మీరు కార్ లేకుండా బయటకు ఎందుకు వచ్చారు సార్ అని అడిగారు….