నెంబర్ టైప్ చేస్తే నేమ్ స్క్రోల్ అవ్వడంతో పాటు రింగ్ అవ్వడంతో ఆ పేరు చూసి హాండ్స్ లో షివరింగ్ వచ్చింది కరస్పాండెంట్ సార్.
అటు నుంచి “హలో..!” అనే గొంతు విని సగం చచ్చిపోయి..” హలో సార్..!” అని అన్నాడు వినయంగా రెస్పాండెంట్ సార్.
“హలో.. చెప్పండి..?” అని అన్నాడు అటు నుంచి హుందాగా విజయ్ కృష్ణ ఫాదర్.
“సార్ మా అబ్బాయికి,మీ సన్ కి మధ్య ఏదో చిన్న గొడవ అయింది అంట.. అందుకని కాల్ చేశాను మీరు అని తెలియక..” అని అన్నాడు సంజాయిషీ ఇస్తూ కరస్పాండెంట్.