వామ్మో! వీడికి మనసులో మాట్లాడుకున్నా వినబడుతుంది అనుకుంటూ రణధీర్ వెనకాలే వెళ్ళిపోతాడు.
సుమన ఇంటికి వచ్చి ఆ డాక్యుమెంట్స్ ఎక్కడున్నాయో ఎలా కనిపెట్టాలని ప్లాన్ చేసుకుంటూ ఉంటుంది. అప్పుడే సడన్‌గా సీత గుర్తుకు వస్తుంది.
నెమ్మదిగా సీత దగ్గరికి వెళ్లి, “సీతా! ఏం చేస్తున్నావ్?” అంటూ మాట కలపడానికి ప్రయత్నిస్తుంది. కానీ సీత పెద్దగా మాట్లాడదు కాబట్టి పొడిపొడిగా సమాధానాలు చెబుతూ ఉంటుంది.
కావాలని మంచిగా నటిస్తూ, “సీతా! నీతో మాట్లాడాలని ఉంటుంది. కానీ మా అమ్మ చూస్తే తిడుతుంది. అందుకే ఎప్పుడూ నీతో పెద్దగా మాట్లాడడానికి ప్రయత్నించలేదు” అని అనగానే, మన అమాయకమైన సీత అది నమ్మేసి, “అవునా! అయినా పిన్ని గారు చూస్తే ఏమైనా అంటారేమో. సుమనా! నువ్వు అనవసరంగా ఇబ్బందిలో పడతావు. పర్వాలేదులే, మాట్లాడకపోతే ఏమవుతుంది?” అని అంటుంది.
పర్వాలేదు సీతా! ఇప్పుడు మా అమ్మ లేదు, పడుకుంది. ఇప్పుడు చెప్పు, మీ ఇంట్లో ఎలా గడిచింది? బాగా ఎంజాయ్ చేశావా?” అని మాట్లాడుతూ, మాటల్లో మాట కలుపుతూ అన్ని విషయాలు తెలుసుకోవాలని ప్రయత్నిస్తుంది.
సుమన అసలు రూపం తెలియని సీత, తన ఇంట్లో ఏం జరిగిందో అంతా చెబుతూ ఉంటుంది.