సీత మొదట వద్దని చెప్పినా, వసుంధర దేవి గారు, “నువ్వు రామ్ పక్కన మన ఇంటి గౌరవానికి తగ్గట్టుగా ఉండాలి. ఇలా ఉండకూడదు” అంటూ, తను ఎంత చెప్పినా వినకుండా సీతను అందంగా రెడీ చేస్తారు.
సీతను రెడీ చేసిన వసుంధర దేవి గారి దగ్గరికి రాజ్యలక్ష్మి గారు ఒక డైమండ్ సెట్ తీసుకొచ్చి ఇస్తారు. అవి చూసిన సీత, “ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అమ్మమ్మగారు? నాకు ఇలాంటి ఖరీదైన వస్తువులు వాడడం ఇష్టం ఉండదు” అంటుంది.
“అలవాటు చేసుకోవాలి సీతా! మన ఇంటి గౌరవ ప్రతిష్ఠలను నిలబెట్టే కోడలిగా నువ్వు ఉండాలి. కాదనకుండా మీ అత్తయ్య చెప్పినట్టు చేయి” అని రాజ్యలక్ష్మి గారు చెప్పగానే, సీత మారుమాట్లాడకుండా వసుంధర దేవి గారు చెప్పినట్టుగా చేస్తూ ఉంటుంది.
వసుంధర దేవి గారు డైమండ్ సెట్‌ను సీత మెడలో వేసి అందంగా రెడీ చేస్తారు.
సీత ఆ చీరలో, ఆ డైమండ్స్ తలుపులతో ఏమాత్రం తీసిపోకుండా చాలా అందంగా మెరిసిపోతూ ఉంటుంది.
రాజ్యలక్ష్మి గారు సీత దగ్గరికి వచ్చి, “ఎంత బాగున్నావే మనవరాలా! నా దిష్టే తగిలేలా ఉంది. వసుంధరా, అమ్మాయికి దిష్టిచుక్క పెట్టు” అంటారు.