New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
💘 𝑺𝒐𝒇𝒕 & 𝑹𝒐𝒖𝒈𝒉 𝑳𝒐𝒗𝒆 𝑺𝒕𝒐𝒓𝒚 💘-1 – 4

💘 𝑺𝒐𝒇𝒕 & 𝑹𝒐𝒖𝒈𝒉 𝑳𝒐𝒗𝒆 𝑺𝒕𝒐𝒓𝒚 💘-1 – 4

కాఫీ తాగగానే విక్రమ్ కళ్లు మెరిశాయి…నిజంగానే ఆ కాఫీ చాలా అద్భుతంగా ఉంది..ఇంట్లో వాళ్ళ అమ్మ చేసి ఇచ్చినట్టు…ఎంతో టేస్టీగా ఉంది……..

 

కాఫీ ఎలా ఉంది సార్?అని రుక్మిణి  ఆత్రం ఆపుకోలేక అడిగేసింది……………

 

విక్రమ్ కప్పు కింద పెట్టి, ఆమె వైపు చూస్తూ…కాఫీ చాలా బాగుంది. కానీ…నా టేస్ట్‌కి ఇంకాస్త షుగర్ తక్కువైంది అన్నాడు చాలా గంభీరంగా………….

 

అయ్యో… అవునా సార్? నేను ఇప్పుడే వెళ్లి ఇంకొంచెం షుగర్ తీసుకువస్తాను…అంటూ రుక్మిణి కంగారుగా వెనక్కి తిరగబోయింది…………..

 

కానీ విక్రమ్ టక్కున ఆమె చేతి మణికట్టుని పట్టుకున్నాడు…………..

 

​ఆ స్పర్శకి రుక్మిణి ఒంట్లో మళ్లీ కరెంట్ షాక్ కొట్టినట్టు అనిపించింది…ఆమె గుండె వేగం వంద రెట్లు పెరిగింది..దిక్కుతోచని స్థితిలో విక్రమ్ వైపు చూసింది..విక్రమ్ ఆమె చేతిని వదలకుండా, ఆమె కళ్లల్లోకి రొమాంటిక్‌గా చూస్తూ అన్నాడు………..

 

షుగర్ తేవడానికి ప్యాంట్రీ దాకా వెళ్లాల్సిన అవసరం లేదు రుక్మిణి…నువ్వు ఇలా నా పక్కన నిలబడి ఆ కళ్లతో చూస్తే చాలు…చేదు కాఫీ కూడా నాకు అమృతంలా తీపిగా మారిపోతుంది…………

 

ఆ మాట వినగానే రుక్మిణి ముఖం గులాబీ రంగులోకి మారిపోయింది..విక్రమ్ అంత రఫ్ మనిషి నోట వెంట ఇలాంటి మాట వినేసరికి ఆమెకు ఏం మాట్లాడాలో, ఏం చేయాలో అస్సలు అర్థం కావటంలేదు…………….

 

విక్రమ్ అన్న ఆ రొమాంటిక్ మాటలకి, ఆమె మణికట్టుని చుట్టేసిన అతని వెచ్చని స్పర్శకి రుక్మిణి ఒక్కసారిగా వణికిపోయింది…………

 

ఆఫీస్ ప్యాంట్రీ దాకా వెళ్లక్కర్లేదు, నీ కళ్లల్లోని అమృతం చాలు అన్న ఆ గంభీరమైన గొంతులోని లాలన ఆమె గుండెల్లో కొత్త అలలను సృష్టించింది…………….

 

ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి, కేవలం చదువు, తండ్రి ఆరోగ్యం, బాధ్యతలే లోకంగా బతికిన అమాయకపు  రుక్మిణికి ఇలాంటి మగవాడి స్పర్శ కానీ, ఇలాంటి మాటలు కానీ పూర్తిగా కొత్త………………..

 

ఆమె ముఖం సిగ్గుతో, కంగారుతో కందిపోయిన టొమాటోలా ఎర్రబడింది……………

 

విక్రమ్ చేతి పట్టు నుంచి తన చేతిని నెమ్మదిగా వెనక్కి లాక్కోవడానికి ప్రయత్నిస్తూ, కళ్లు నేలకేసి, 

 

సా… సార్… ప్లీజ్ వదలండి. ఎవరైనా చూస్తే బాగుండదు. నేను… నేను మీ అసిస్టెంట్‌ని మాత్రమే సార్…అంటుంది రుక్మిణి…………….

 

రుక్మిణి గొంతులోని ఆ వణుకు, ఆమె కళ్లల్లోని అమాయకపు కంగారు చూసి విక్రమ్‌కు ఆమెపై మరింత ఇష్టం పెరిగింది..కానీ ఆమెను మరీ ఎక్కువ ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక, నెమ్మదిగా తన చేతి పట్టును వదిలేశాడు……………

 

విక్రమ్ వెనక్కి జరిగి, కుర్చీలో రిలాక్స్‌గా కూర్చుని, తన రెండు చేతులూ గడ్డం కింద పెట్టుకుని ఆమె వైపు చూస్తూ ఒక నవ్వు నవ్వాడు..ఆ నవ్వులో ఒక రకమైన క్లాస్ లుక్, రౌడీతనాన్ని దాచేసిన ఒక ప్రేమికుడి తీక్షణత కనిపిస్తున్నాయి……………

 

సరే… వదిలేస్తాను. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో రుక్మిణి.. ఈ విక్రమ్ రాథోడ్ ఏ రోజూ, ఏ అమ్మాయి వైపు కన్నెత్తి కూడా చూడలేదు..కానీ నిన్ను చూడగానే నా మనసులో ఏదో మార్పు వచ్చింది. దానికి నేనేం చేయలేను………………

 

ఓకే , ఇక ఆఫీస్ వర్క్ చూడు.. ఈ ఫైల్స్ అన్నీ చెక్ చేసి నాకు వన్ అవర్‌లో రిపోర్ట్ ఇవ్వాలి…అంటూ ఒక పెద్ద ఫైళ్ల కట్టను ఆమె వైపు నెట్టి,విక్రమ్ రుక్మిణి చేతిని వదిలి పెడతాడు………….

 

విక్రమ్ ఎప్పుడైతే తన చేతి పట్టు విడిచి పెట్టాడో రుక్మిణి ఒక్క నిమిషం కూడా అక్కడ నిలబడకుండా, ఆ ఫైళ్లను గుండెలకు హత్తుకుని, దాదాపు పరిగెత్తినంత పని చేస్తూ తన పక్కనే ఉన్న చిన్న కేబిన్‌లోకి వెళ్ళిపోయింది………….

 

తన క్యాబిన్ లో కూర్చున్న రుక్మిణి గుండె ఇంకా కొట్టుకుంటూనే ఉంది…ఏంటి ఈయన ఇలా మాట్లాడుతున్నారు? అంత పెద్ద కంపెనీకి ఎండీ… బయట చూస్తేనేమో రౌడీలని గాల్లో లేపి కొడతారు. లోపలికి వస్తేనేమో ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు…………..

 

దేవుడా… నన్ను ఎలాంటి ఊబిలో పడేశావ్? నా ఉద్యోగం ప్రశాంతంగా సాగేలా చూడు తల్లీ! అని తన ఇష్టదైవానికి మనసులోనే దండం పెట్టుకుంది……………

 

​కాలం ఎవరి కోసమో ఆగదు కదా, అలానే సమయం గడుస్తూ మధ్యాహ్నం ఒంటి గంట అయింది..ఆఫీస్ లో ఉన్న వాళ్లంతా లంచ్ బ్రేక్ కోసం కదులుతున్నారు……………..

 

రుక్మిణి కూడా తన ఇంటి నుంచి తెచ్చుకున్న చిన్న స్టీల్ క్యారేజ్ బాక్స్ ఓపెన్ చేసింది…అందులో అన్నం, ఇంట్లో వండిన తోటకూర పప్పు, కొద్దిగా ఆవకాయ పచ్చడి ఉన్నాయి.. ఊరి నుంచి తెచ్చిన ఆవకాయ వాసన క్యాబిన్ అంతా గుబాళించింది…………….

 

ఆమె మొదటి ముద్ద నోట్లో పెట్టుకోబోతుండగా… హఠాత్తుగా విక్రమ్ ఆమె క్యాబిన్ డోర్ నెట్టుకుని లోపలికి వచ్చాడు..కోటు తీసేసి, షర్ట్ చేతులు పైకి మడిచి ఉన్న అతని ‘మాస్ అండ్ రఫ్’ లుక్ చూసి రుక్మిణి చేతిలోని ముద్ద అలాగే ఆగిపోయింది……………..

 

To be continued…✍️