💘 𝑺𝒐𝒇𝒕 & 𝑹𝒐𝒖𝒈𝒉 𝑳𝒐𝒗𝒆 𝑺𝒕𝒐𝒓𝒚 💘-1 – 3
ఆ మాటలు రుక్మిణి మనసుకు ఎంతో ఊరటనిచ్చాయి…ఇందాక బయట చూసిన ‘రఫ్’ మనిషి వెనుక…ఇంత ‘సాఫ్ట్’ అండ్ కేరింగ్ గుణం ఉందా? అని ఆమె మనసులోనే ఆశ్చర్యపోయింది…………..
ఇక చాలు… మొహం ఇలా పెట్టకు. ఇంటర్వ్యూ పాస్ అయిపోయావ్. రేపటి నుంచి నువ్వే నా పర్సనల్ అసిస్టెంట్. రేపు ఆఫీస్‌కి వచ్చేటప్పుడు మొహంలో భయం కాదు… ఒక చిన్న చిరు నవ్వుతో రావాలి, ఓకేనా? అన్నాడు విక్రమ్, ఆమె కళ్లల్లోకి చూస్తూ…………….
రుక్మిణి నెమ్మదిగా తల ఊపింది. ఆమె మనసులో ఉన్న భయమంతా మాయమై, విక్రమ్ రాథోడ్ పై ఒక తెలియని గౌరవం, ఒక కొత్త అనుభూతి మొదలయ్యాయి…………..
ఆఫీస్ మొదటి రోజు… హైదరాబాద్ నగరం ఎప్పటిలాగే బిజీగా ఉంది..కానీ రుక్మిణి మనసు మాత్రం ఈరోజు కొంచెం ప్రశాంతంగా, మరికొంచెం ఉత్సాహంగా ఉంది……………
తెల్లటి కాటన్ చుడీదార్ వేసుకుని, తలలో చిన్న మల్లెపూల మాల పెట్టుకుని, నుదుటన చిన్న బొట్టుతో సరిగ్గా తొమ్మిది గంటలకే ఆఫీస్ లోపల అడుగుపెట్టింది రుక్మిణి…………
నిన్నటి భయం లేదు కానీ, ఆ ‘రఫ్ అండ్ టఫ్’ బాస్ విక్రమ్ రాథోడ్ పక్కన పర్సనల్ అసిస్టెంట్‌గా ఎలా పని చేయాలా అనే చిన్న కంగారు మాత్రం ఉంది………….
క్యాబిన్ బయట ఉన్న సెక్రటరీ రుక్మిణిని చూడగానే నవ్వి, ఆల్ ది బెస్ట్ మేడం లోపలికి వెళ్ళండి, సర్ ఆల్రెడీ వచ్చేశారు…. అని అన్నాడు………….
రుక్మిణి సెక్రటరీ వైపు చూసి చిన్న స్మైల్ ఇచ్చి, అక్కడ నుంచి నెమ్మదిగా ఊపిరి పీల్చుకుని, విక్రమ్ క్యాబిన్ దగ్గరికి వెళ్లి, డోర్ నాక్ చేసి… మే ఐ కమ్ ఇన్ సర్? అంది…………….
కమిన్, అని లోపల నుంచి విక్రమ్ గంభీరమైన గొంతు వినిపించింది……………
రుక్మిణి లోపలికి అడుగుపెట్టింది…ఈరోజు విక్రమ్ రాయల్ బ్లూ కలర్ షర్ట్, బ్లాక్ ట్రౌజర్స్ వేసుకుని, ల్యాప్‌టాప్‌లో ఏదో సీరియస్‌గా చూస్తున్నాడు…….
ఇంతలో రుక్మిణి లోపలికి వచ్చేటప్పుడు ఆమె పట్టీల శబ్దం, అతనికి వినసొంపుగా వినిపించి నెమ్మదిగా తలెత్తాడు………….
అంతే! రుక్మిణిని చూడగానే విక్రమ్ చేతిలోని పెన్ ఒక్క క్షణం ఆగిపోయింది…జీన్స్, మోడ్రన్ డ్రెస్సులు వేసుకునే అమ్మాయిలను చూసే ఆ కార్పొరేట్ ఆఫీస్‌లో……………..
ఇంత పద్ధతిగా, దేవాలయానికి వెళ్లే అమ్మాయిలా అమాయకంగా ఉన్న రుక్మిణిని చూడగానే విక్రమ్ గుండెల్లో ఏదో తెలియని అలజడి….ముఖ్యంగా ఆమె తలలోని మల్లెపూల సువాసన క్యాబిన్ అంతా వ్యాపించి, అతని మనసుని మైమరపించింది………………
కానీ విక్రమ్….రియాలిటిలోకి వస్తూ వెంటనే తన ఫేస్‌ని నార్మల్‌గా మార్చేసుకుని, గొంతు సవరించుకున్నాడు………………
గుడ్ మార్నింగ్…రుక్మిణి టైమ్‌కి వచ్చావ్, గుడ్. ఇంటర్వ్యూలో ఏడ్చినట్టు ఈరోజు కూడా ఏడవవుగా? అన్నాడు పెదవులపై చిన్న నవ్వుతో, ముందు రోజు జరిగిన విషయాన్ని గుర్తు చేస్తూ…….
రుక్మిణి కాస్త నెమ్మదైన స్వరం తో లేదు సార్… ఈరోజు ఏడవను, అంది తల దించుకుని………..
సరే, నువ్వు నా పర్సనల్ అసిస్టెంట్‌వి, కాబట్టి కొన్ని కండిషన్స్ నువ్వు ఫాలో అవ్వాలి………..
అంటూ విక్రమ్ సీరియస్‌గా టేబుల్ మీద చేతులు పెట్టాడు….చెప్పండి సార్…అంది రుక్మిణి డైరీ, పెన్ చేతిలోకి తీసుకుంటూ…………..
కండిషన్ నంబర్ 1,నాకు కాఫీ అంటే చాలా ఇష్టం. కానీ బయట కాఫీ షాప్స్ లో దొరికే కెమికల్ కాఫీలు నాకు నచ్చవు, నేను రోజుకి రెండు సార్లు మాత్రమే కాఫీ తాగుతాను సో…నా టేస్ట్‌కి తగ్గట్టు నువ్వే నీ చేతులతో స్వయంగా కాఫీ కలిపి ఇవ్వాలి…………
కండిషన్ నంబర్ 2, నేను బిజినెస్ విషయాల్లో చాలా రఫ్‌గా ఉంటాను, క్లయింట్స్‌తో మాట్లాడేటప్పుడు నా వాయిస్ గట్టిగా ఉంటుంది.. అందుకని భయపడిపోయి, నువ్వు కన్నీళ్లు పెట్టుకోకూడదు…………….
కండిషన్ నంబర్ 3, ఇదే అసలైన కండిషన్ ఆఫీస్ టైమ్స్ లో నా పర్మిషన్ లేకుండా నువ్వు నా క్యాబిన్ వదిలి ఎక్కడికీ వెళ్లకూడదు, నీకు ఏ అవసరం ఉన్నా ఫస్ట్ నాకే చెప్పాలి…అండ్…ఎప్పుడూ నా కళ్ల ముందే ఉండాలి…………….
ఆఖరి కండిషన్ వినగానే రుక్మిణి ఆశ్చర్యంగా విక్రమ్ వైపు చూసింది…ఎప్పుడూ మీ కళ్లముందే ఉండాలా? ఇదేం కండిషన్ బాబోయ్…అని మనసులో అనుకుంది…………….
ఏంటి… ఆలోచిస్తున్నావ్? ఈ కండిషన్స్ ఓకేనా? అని విక్రమ్ ఆమె మొహంలోకి చూశాడు………..
ఓ… ఓకే సార్..అలాగే చేస్తాను, అంది రుక్మిణి వినయంగా…………..
ఒక గంట తర్వాత… విక్రమ్ చెప్పినట్టే రుక్మిణి ఆఫీస్ ప్యాంట్రీలోకి వెళ్లి చాలా శ్రద్ధగా కాఫీ తయారు చేసింది…ట్రేలో కాఫీ కప్పు పట్టుకుని, వణుకుతున్న చేతులతో మెల్లిగా నడుచుకుంటూ విక్రమ్ క్యాబిన్‌లోకి తెచ్చింది……………..
సార్… కాఫీ…అంటూ టేబుల్ మీద పెట్టింది……..
విక్రమ్ ల్యాప్‌టాప్ నుంచి తల తిప్పి, ఆ కాఫీ కప్పుని చూశాడు…నెమ్మదిగా కప్పు అందుకుని ఒక సిప్ చేశాడు…రుక్మిణి ఊపిరి బిగబట్టి అతని మొహం వైపు చూస్తోంది…
తను చేసిన నచ్చుతుందో లేదో అని…………………
To be continued…✍️
Swipe left/right or tap the sides to turn pages