💘 𝑺𝒐𝒇𝒕 & 𝑹𝒐𝒖𝒈𝒉 𝑳𝒐𝒗𝒆 𝑺𝒕𝒐𝒓𝒚 💘-1 – 5
ఏంటి రుక్మిణి… అప్పుడే లంచ్ మొదలుపెట్టేశావ్? నా పర్మిషన్ లేకుండా నువ్వు లంచ్ బాక్స్ ఎలా ఓపెన్ చేస్తావ్? అన్నాడు విక్రమ్ సీరియస్
గా ఉన్నట్టు నటిస్తూ…………….
రుక్మిణి కంగారుగా లేచి నిలబడింది…సార్… ఒంటిగంట అయింది కదా అని… అందరూ తింటున్నారు కదా సార్…అంది అమాయకంగా……………
అందరూ వేరు, నువ్వు వేరు..నువ్వు నా పర్సనల్ అసిస్టెంట్వి, బాస్ ఆకలితో ఉంటే…అసిస్టెంట్ ఇక్కడ హ్యాపీగా ఆవకాయ పప్పు అన్నం తింటుందా? అంటూ విక్రమ్ నేరుగా వచ్చి ఆమె పక్కనే ఉన్న కుర్చీ లాక్కుని కూర్చున్నాడు…………
విక్రమ్ అలా కూర్చోవడం చూసి రుక్మిణికి ఏం చేయాలో పాలుపోలేదు…సార్… మరి మీరు లంచ్ ఆర్డర్ చేసుకోలేదా? సార్… అంటే ఫైవ్ స్టార్ హోటల్ నుంచి తెప్పించుకుంటారు కదా…అంది నెమ్మదిగా………….
ప్రతిరోజూ ఆ హోటల్ ఫుడ్ తిని తిని బోర్ కొట్టింది.. అందుకే ఈరోజు నీ బాక్స్ లో ఉన్న ఆవకాయ వాసన నన్ను ఇక్కడికి లాక్కొచ్చింది.. అని అంటాడు విక్రమ్……………
నాకు కూడా తినిపిస్తావా…లేక నేనే లాక్కోమంటావా?అన్నాడు విక్రమ్, ఆమె కళ్లల్లోకి రఫ్ గా చూస్తూ…అన్నాడు…………….
అయ్యో…వద్దు సార్, లాక్కోవడం ఎందుకు, ఇది చాలా సాదాసీదా వంట సార్, మీకు నచ్చుతుందో లేదో…అంటూ రుక్మిణి తన బాక్స్‌ను అతని వైపు జరిపి, స్పూన్ ఇవ్వబోయింది……………..
కానీ విక్రమ్ స్పూన్ తీసుకోలేదు,నాకు స్పూన్లతో తినడం నచ్చదు, నువ్వు ఇందాక ముద్ద కలిపావు కదా… ఆ ముద్దే నాకు తినిపించు,అన్నాడు హుకుం జారీ చేస్తున్నట్టు……………..
సార్…. అది… అది ఎంగిలి సార్… నేను ఆల్రెడీ చేత్తో కలిపేశాను… మీకు ఎలా పెడతాను?అని రుక్మిణి ముఖం భయంతో, అంటుంది………………
నేను చెప్పింది నీకు వినపడలేదా రుక్మిణి? ఈ విక్రమ్ రాథోడ్ ఒకసారి చెప్తే వినాలి, లేదంటే రఫ్ గా ఎలా లాక్కోవాలో నాకు తెలుసు,అంటూ విక్రమ్ ఆమె చేతిని పట్టుకుని, ఆమె వేళ్ల మధ్య ఉన్న అన్నం ముద్దను తనే ముందుకు వంగి నోటితో అందుకున్నాడు…………………
ఆమె చేతి వేళ్లు విక్రమ్ పెదవులకు తగిలాయి. ఆ క్షణంలో రుక్మిణి ప్రపంచాన్ని మర్చిపోయింది……….
ఆమె కళ్లల్లోని అమాయకత్వం, అతని కళ్లల్లోని గాఢమైన ప్రేమ ఒకదానికొకటి తారసపడ్డాయి…………
విక్రమ్ ఆ ముద్దను నములుతూ…అద్భుతం! నా లైఫ్ లో ఇంత రుచికరమైన పప్పు అన్నం, ఆవకాయ ఎప్పుడూ తినలేదు. నీ చేతి వంటలో ఏదో మ్యాజిక్ ఉంది రుక్మిణి,అన్నాడు విక్రమ్ మనస్ఫూర్తిగా…………….
రుక్మిణి గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. ఆమె కళ్లల్లో మళ్లీ చిన్నగా తడి చేరింది, కానీ ఈసారి అది భయంతో వచ్చిన తడి కాదు… విక్రమ్ చూపిస్తున్న విపరీతమైన ఆదరణ, చొరవ వల్ల కలిగిన ఒక తెలియని అనుభూతి………………
సార్… మీరు నాపై ఇంత చొరవ చూపిస్తుంటే నాకు భయంగా ఉంది సార్. నేను చాలా పేదదాన్ని… మా నాన్నగారి ఆశలన్నీ నాపైనే ఉన్నాయి. ప్లీజ్ నన్ను నా దారిన నన్ను ఉద్యోగం చేసుకోనివ్వండి, అంటూ రెండు చేతులూ జోడించి అడిగింది……………….
విక్రమ్ నెమ్మదిగా లేచి నిలబడ్డాడు. ఆమె ముఖానికి దగ్గరగా వచ్చి…నువ్ ఇలా ఎందుకు భయపడుతున్నావ్ భయపడకు క్యూటీ. ఈ విక్రమ్ ఎవరినైనా రఫ్ గా కొట్టగలడు………….
కానీ అంతే సాఫ్ట్ గా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించగలడు. నిన్ను ఏ రోజూ కష్టపెట్టను……….
కానీ నా మనసు నుంచి నిన్ను దూరం చేయడం మాత్రం నా వల్ల కాదు,అని చెప్పి, ఆమె తలపైన నెమ్మదిగా నిమిరి, ఒక మధురమైన జ్ఞాపకాన్ని ఆమె మనసులో వదిలి తన క్యాబిన్ లోకి వెళ్ళిపోయాడు………….
విక్రమ్ అంత ప్రేమగా మాట్లాడి వెళ్ళిపోయాక.. రుక్మిణి ఆ సీట్ లో అలాగే ఉండిపోయింది………
ఆమె గుండె ఇంకా శరవేగంతో కొట్టుకుంటూనే ఉంది. బుగ్గల్లో అప్పటికే చేరిన ఎరుపు అస్సలు తగ్గడం లేదు…………….
ఏంటో ఈయనగారి ప్రవర్తన? ఒకసారి చూస్తేనేమో సింహంలా గర్జిస్తారు, మరోసారి చూస్తేనేమో ఇంత సాఫ్ట్‌గా మారిపోతారు! అనుకుంటూ తన చెంపలపై చేతులు వేసుకుని, ఆ మధురమైన జ్ఞాపకాన్ని మనసులోనే నెమరువేసుకుంది……………..
సాయంత్రం ఆరు కా వస్తోంది. ఆఫీస్ అంతా ఖాళీ అవుతోంది. రుక్మిణి కూడా తన ఫైల్స్ అన్నీ సర్దుకుని, బ్యాగ్ తీసుకుని బయటకు వెళ్లబోతుండగా……………….
ఆకాశం ఒక్కసారిగా నల్లటి మబ్బులతో కమ్మేసింది. చూస్తుండగానే హైదరాబాద్ నగరాన్ని ముంచెత్తుతూ భారీ వర్షం మొదలైంది…………….
జోరుగా కురుస్తున్న వానను చూస్తూ రుక్మిణి ఆఫీస్ ఎంట్రన్స్ వద్ద నిలబడింది. చేతిలో గొడుగు లేదు, బయట చూస్తేనేమో రోడ్డంతా నీళ్లతో నిండిపోయింది. ఆటోలు కూడా దొరికేలా లేవు……………
అబ్బా… ఈ టైమ్‌లో ఇంత పెద్ద వానా? ఇంటికి ఎలా వెళ్లాలి? నాన్న టాబ్లెట్స్ వేసుకునే టైమ్ అయిపోతోంది…అని కంగారుగా దిక్కులు చూడటం మొదలుపెట్టింది……………….
సరిగ్గా అదే సమయంలో…ఎవరు వచ్చారో 🤔
To be continued…✍️
Swipe left/right or tap the sides to turn pages