ఫ్లయిట్ కి టైమ్ అవుతోంది నిషాన్ ఇంకా మీ అన్నయ్య వదిన కిందకు రాలేదు వెళ్ళి పిలువు అందరం కలసి బ్రేక్ఫాస్ట్ చేసి ఎయిర్ పోర్ట్ కి స్టార్ట్ అవుదాం అని చెప్తున్న రాగిణి వైపు అసహనంగా చూస్తూ వదిన అన్న పిలుపు వినలేనట్లు రెండు చేతులతో చెవులు మూసుకుని అన్నయ్య రూమ్ డోర్ నాక్ చేయకుండా డైరక్ట్ గా లోపలికి వచ్చి వీళ్ళను ఇలా చూసి గుండెళ్ళో గునపం దిగినట్టు ఫీల్ అవుతూ ఆశ్రిత వైపు కన్నీళ్ళతో చూస్తూ వెనక్కి తిరిగి కన్నీళ్ళు పెట్టుకుంటాడు
నిషాన్ లోపలికి రాగానే వచ్చింది నిషాన్ అని అర్తం చేసుకున్న ఆయుష్ ఆశ్రిత కి దూరం జరిగి నలిగిన తన షర్ట్ సరి చేసుకుంటూ ఆశ్రిత వైపు చూస్తాడు ఆశ్రిత భారంగా ఊపిరి పీల్చుకుంటూ ఆయుష్ వైపు కోపంగా చూస్తు ఊపిరి కూడా ఆడనివ్వరా ఆయిష్ గారు మీ ఇష్టానికి నన్ను సాంతం చేసుకోవడమే కాకుండా ఇలా బల…!! అంటూ ఎదురుగా అటు వైపు తిరిగున్న నిషాన్ ను చూసి నోట్లో మాట నోట్లోనే ఆపేసి ఫాస్ట్ గా పరిగెడుతూ వాష్ రూమ్లో కి వెళ్తుంది