ఆశ్రిత రూమ్ లోకి వెళ్ళేసరికి ఆయుష్ బాల్కనీ లో ఎవరితోనో మొబైల్ లో సీరియస్ గా మాట్లాడుతూ కనిపిస్తాడు ఈ బీస్ట్ కి అందరినీ భయపెట్టడం బాగా అలవాటు అయిపోయింది పాపం అవతల కాల్ లో ఎవరో కానీ ఈ బీస్ట్ వాయిస్ కే సగం చచ్చిపోయి ఉంటారు అని జాలి పడుతూ బెడ్ ను సర్దుతూ అవును నిన్న ఇక్కడ మొబైల్ పెట్టాను కదా మార్నింగ్ కూడా హడావిడి లో గమనించలేదు ఎటెల్లింది ఈ మొబైల్ ఇక్కడే ఉండాలి కదా అంటూ కంగారుగా పిల్లోస్ తీసేసి చూస్తుంది కానీ బెడ్ మీద ఎక్కడ మొబైల్ కనిపించక పోయేసరికి ఆశ్రిత కు చమటలు పడతాయి
ఓహ్ గాడ్ మొబైల్ ఇక్కడే కదా మొన్న పెట్టేసి వెళ్ళాను అంటూ రూమ్ మొత్తం చూస్తు వుంటుంది కానీ ఎక్కడ కనిపించదు పోనీ బెడ్ కింద పడిపోయిందా అంటూ బోర్లా పడుకుని బెడ్ కిందకు తొంగి చూసి అక్కడ కూడా లేకపోయేసరికి నీరసంగా పైకి లేచిన ఆశ్రిత ఎదురుగా ఆయుష్ హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని కనిపించడం తో బయపడి రెండు అడుగులు వెనక్కి వేసి ఏ…ఏమ్ కావాలీ ఆయుష్ గారు ఎందుకలా దయ్యాన్ని చూస్తున్నట్టు చూస్తున్నారు అని తన ఫేస్ లో ఎక్స్ప్రెషన్ ఆయుష్ కి కనిపించకుండా మొహాన నవ్వు పులుముకుని అందంగా నవ్వుతూ అడుగుతుంది