New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
Episode 19

Episode 19

హాస్పిటల్ వర్క్ చేసే సిస్టర్ హెల్ప్ తో ప్రభాకర్ కి బాత్ చేయించి రూమ్ లోకి తీసుకొని వచ్చి బెడ్ మీద పడుకోబెట్టి మెల్లగా జ్యూస్ కొంచెం కొంచెం తాగించి టాబ్లెట్స్ వేసి ప్రభాకర్ పక్కనే కూర్చుని ప్రభాకర్ పరిస్తితి చూసి లోలోన కుమిలిపోతు ఇందుకు కారణం అయిన ఆయుష్ మీద మరింత కోపం పెంచుకుంటూ దూరం అయిన ఆశ్రిత ను తలచుకుంటూ బాధ పడుతూ ఉంటుంది అనిత కంట్లో నీళ్లు చూసిన ప్రభాకర్ కల్లు కూడా వర్షిస్తాయి ప్రభాకర్ కన్నీటి చుక్కలు అనిత ఎడమ చేతి మీద పడ్డం తో అనిత ప్రభాకర్ వైపు చూసి ప్రభాకర్ కంట్లో నీళ్లు ధారలుగా కారడం చూసి కంగారుగా పైకి లేచి ప్రభాకర్ కన్నీళ్ళు తుడిచి ఏమైందండీ ఎందుకు ఈ కన్నీళ్ళు అంటూ ప్రభాకర్ కి ఎక్కడైనా నొప్పిగా ఉండి బాధ పడుతున్నాడేమో అని టెన్షన్ గా ప్రభాకర్ ను చూస్తూ అడుగుతుంది

నువ్వు ఎందుకు ఏడుస్తున్నావ్ అన్నట్టు తన వైపు కళ్ళను తిప్పుతూ అంటున్న ప్రభాకర్ ను చూసి కంట్లో ఎదో పడిందండి అంతే ఇంకేం లేదు అంటూ కన్నీళ్ళు తుడుచుకుంటూ యాపిల్ తింటారా అంటూ పక్కనున్న యాపిల్ కట్ చేసి ప్రభాకర్ నోటికి అందిస్తుంది కానీ ప్రభాకర్ దాన్ని తినకుండా అలాగే నోట్లో పెట్టుకొని తన బెడ్ పక్కనే నవ్వుతున్న తన ఇద్దరి కూతుర్ల ఫొటో వైపు కళ్ళను తిప్పి కన్నీటికి స్వేచ్చ ను ఇస్తాడు

Premium Unlock Premium Full story · from ₹69
Log in & Pay