ఆయుష్ తనను రూమ్ కి రమ్మని చెప్పడం తో ప్రణవి ఆగమేఘాల మీద తన రూమ్ వైపు పరిగెడుతూ డోర్ లోనే ఆగిపోతుంది కారణం ఆయుష్ కౌచ్ లో కూర్చుని మెడ వెనుక రబ్ చేస్తూ మొహాన్ని చిరాగ్గా పెట్టుకొని కూర్చుని కనిపిస్తాడు ఆయుష్ తో కలిసి ఎక్కువ వున్నది ఈ ఇంట్లో ప్రణవి మాత్రమే ఆయుష్ తో కలిసి లండన్ లోనే తన ఇంట్లోనే ఉండడం వల్ల చాలా వరకు ఆయుష్ అలవాట్లు, తన ఇష్టా ఇష్టాలు, ఫ్రెండ్స్ ఇలా అన్ని తెలుసు కనుక ఆయుష్ వైపు చూస్తూ ఉంటుంది
ఇప్పుడు ఆయుష్ ను అలా చూసి ఆడుగులు ముందుకు పడక బావ ఎందుకు కోపంగా వున్నాడు ఆ కోపానికి నాకు ఏమైనా సంబంధం ఉందా అందుకే నన్ను రమ్మని పిలిచాడా అని అలోచిస్తూ ఆయుష్ చేతి వైపు చూడగా నిన్న ఆయుష్ రూమ్ నుండి ఆశ్రిత కోసం ఆయుష్ తెచ్చిన మొబైల్ వాళ్ళు వెళ్ళాక తను తీసుకుని ఇక్కడే దాచిన మొబైల్ ఆయుష్ చేతిలో కనిపించడం తో ఆయుష్ కోపానికి కారణం అర్తం అవుతుంది