New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

కలియుగ మ(మా)యసభ

113 stories Ongoing Inspirational Crime Family Drama

పచ్చటి పందిరి... చిన్నపిల్లలతో కోలాహాలతో, పెద్దవాళ్ళ పెద్దరికలతో, ఆడపడుచుల గాజుల్ల సవ్వళ్ళతో, మగవాళ్ళ ఉరుకుల పరుగులతో, పాకశాలలో గుమగుమలతో, బంధువుల ఆర్భాటాలతో కలకలలాడుతూ ఉంది.ఒక పెద్దావిడ మధ్య వయసుగల మహిళతో.. "అమ్మాయిని తీసుకురండి మళ్ళీ వర్జ్యం వస్తుంది." అని తొందరపెట్టింది."శైలు చెల్లిని అంట తీసుకురమ్మ.." అని అంది ఆ మధ్య వయసుగల మహిళ నిండైన కట్టు బొట్టుతో ఉన్న వివాహిత వైపు చూస్తూ."సరే పిన్ని." అని చిరునవ్వుతో కూర్చున్న కుర్చీలో నుంచి పైకి లేచింది హుషారుగా ఆ వివాహిత అయినటువంటి శైలు."ఏ అమ్మాయి నువ్వు ఆగు..' అని శైలు వైపు చూసింది కోపంగా,ఆ మధ్య వయసు గల స్త్రీని ఉరిమి చూస్తున్నట్టుగా చూసి..'ఎవరికి ఏం పని చెప్పాలో కూడా తెలియదు నీకు, ఇంత…

Browse Stories

కలియుగ మ(మా)యసభ Premium

కలియుగ మ(మా)యసభ – 11

మూడు రోజుల్లో తన కోరికను తీర్చకపోతే అనురాధ డ్రగ్స్ కి ఆడిక్ట్ అయ్యింది అని అందరిని నమ్మించి రియాబిలేషన్ సెంటర్ కి పంపించినట్టుగా పంపించి వేరే దేశాలకి తనని అమ్మేస్తాను అని చెప్పాడు అంట దశరథ్ పటేల్.   దాని గురించి భయపడుతూ ఈ అమ్మాయి ఈ రాత్రి సూసైడ్ చేసుకోవాలి అనుకుంది..   నేను ఒక్కదాన్నే ఎమ్మెల్యేని ఎదురించలేను నాకు మీ సాయం కావాలి సార్.. ఎమ్మెల్యే కి తొత్తులు ఉంటారు కొంతమంది అది మీ […]

3 min 9 views
కలియుగ మ(మా)యసభ Premium

కలియుగ మ(మా)యసభ – 12

“అతను టార్చర్ చేయడాన్ని ఎంతో కొంత వరకు భరిస్తుంది.. కానీ ఆడది ప్రాణం కంటే విలువగా భావించే మానాన్ని దోచుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు,అందుకే భయపడుతుంది.” అని అంది వేద శౌర్యని చూస్తూ.       ఒక్క నిమిషం ఆలోచించి అనుని చూస్తూ..  “నువ్వు అందుకే భయపడుతుంటే వీలైనంత వరకు సాక్ష్యాలు సంపాదించు మైక్రో కెమెరాస్ అన్ని క్యాప్చర్ చేస్తుంది, అతను నీ మానానికి హాని కలిగిస్తున్నాడు అన్నప్పుడు చంపేసేయ్.” అని తన రివల్ వర్ అను ముందు […]

3 min 12 views
కలియుగ మ(మా)యసభ Premium

కలియుగ మ(మా)యసభ – 13

వేద స్కూటీ కనిపించేంతవరకు అక్కడే ఉండి ఆ స్కూటీ వెళ్ళిపోగానే తను కూడా కార్ స్టార్ట్ చేసి ఇంటి వైపు వెళ్లాడు అను కేస్ గురించి ఆలోచిస్తూ శౌర్య.         శ్రీపాద శైలుని తీసుకొని ఇంట్లోకి వచ్చేసరికి శ్రీపాద గారి అమ్మగారు పద్మ వాళ్ళ అక్క శోభతో కలిసి ఏదో మాట్లాడుతూ ఉంది.       చిరునవ్వుతో శ్రీపాద వాళ్ళ అమ్మ పక్కన కూర్చోగా,శైలు కిచెన్ లోకి వెళ్ళింది అందరికీ కాఫీ […]

3 min 14 views
కలియుగ మ(మా)యసభ Premium

కలియుగ మ(మా)యసభ – 14

“ఒరేయ్ అవేం మాటలు రా.. అమ్మ చెప్తుంది కూడా నీ గురించే కదా,నీ మంచి గురించి ఆలోచించే కదా..” అని అంది శోభ శ్రీపాదని చూస్తూ.       “నేను మాట్లాడుతుంది మా అమ్మతో పెద్దమ్మా నీతో కాదు..” అని అన్నాడు ఇంక నువ్వు ఆపు అన్నట్టుగా శోభాని చూస్తూ శ్రీపాద.. తనకి తెలుసు పెద్దమ్మ మాటలు విని ఆ మాటలని తమ మీద ప్రయోగిస్తుంది అమ్మ అని,ప్రతిసారి జరిగేది అదే కదా మరి కొత్తగా […]

3 min 15 views
కలియుగ మ(మా)యసభ Premium

కలియుగ మ(మా)యసభ – 15

తన కొడుకుని మార్చింది,తన కొడుకుని తనకి కాకుండా చేసింది అని మనసులో నాటుకుపోయిన్న పద్మ..”చూసావా అక్క నంగనాచి తుంగ బుర్రల చేసేవి అన్ని చేసి ఇప్పుడు తలదించుకొని ఎంత బాగా వెళుతుందో..ఎవరైనా చూస్తే ఇది ఎంత అమాయకురాలో అనుకుంటారు.   పులిలా ఉండే నా కొడుకుని పిల్లిలా దాని వెనక తిప్పుకుంటుంది టక్కులాడి.” అని అంది మనసులో ఉన్న కోపాన్ని ఎలా బయట పెట్టాలో తెలియక మాటల రూపంలో బయట పెడుతూ.       రూమ్ […]

3 min 13 views
కలియుగ మ(మా)యసభ Premium

కలియుగ మ(మా)యసభ – 16

శౌర్య అను ముందు గన్ పెట్టాక అనుకి ఏమీ కాదు అని శౌర్య ధైర్యం చెప్పగానే తన హ్యాండ్ బ్యాగ్ లో గన్ పెట్టుకోవడం గుర్తు తెచ్చుకొని.. స్టాఫ్ రూమ్ లోకి వచ్చిన అనుని చూసి చుట్టూ అంత గమనించి సైగ చేసింది బ్యాగ్ ఇవ్వు అన్నట్టుగా వేద.       అను వేద దగ్గరకి వచ్చి మెల్లగా బ్యాగ్ తీసి వేద ముందు పెట్టింది.     చుట్టూ అంతా మళ్లీ ఇంకోసారి చూసి […]

3 min 10 views
కలియుగ మ(మా)యసభ Premium

కలియుగ మ(మా)యసభ – 17

“ఓకే అక్కతో నన్ను పోల్చకూడదు మరి చెల్లెలి శ్రీమంతంకి రాని అన్నయ్యని ఏం చేయాలి.” అని అంది కన్నీళ్లని తుడుచుకుంటూ లహరి.     అప్పటికే చెమ్మగిల్లిన కళ్ళతో శౌర్య మాటలని వింటున్నా కౌసల్య కడుపుతో ఉన్న పిల్లని బాధ పెట్టకూడదు అని మనసులో అనుకుంటూ కళ్ళు తుడుచుకొని వచ్చి..” వంద గుంజీలు తీయమను వాడిని.” అని అంది చిరునవ్వుతో.     “అమ్మ నువ్వు తనకి లేనిపోని ఐడియాలు ఇవ్వకు..మార్నింగ్ జిమ్ లో నేను ఆల్రెడీ […]

3 min 16 views
కలియుగ మ(మా)యసభ Premium

కలియుగ మ(మా)యసభ – 18

ఆరోజు రాత్రి లాహిరి శౌర్యతో పాటు భోజనం చేసి శౌర్య పక్కనే పడుకుంది, ఎందుకంటే..!లహరికి ఊహ తెలిసే సరికి కస్తూరికి పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ అయిపోయింది సెకండ్ ప్రేగ్నెన్సీలో కాంప్లికేషన్స్ వల్ల బిడ్డ కడుపులోనే చచ్చిపోవడం వల్ల.    కాబట్టి శౌర్య లహరిని ఎప్పుడు కూడా తక్కువ చేసి చూడలేదు శౌర్య లహరికి సొంత అన్నయ్య కాదు అని ఫీలింగ్ ఎప్పుడూ ఎవరికీ కలగలేదు.    శైలు అమ్మకంటే ఒక మెట్టు ఎక్కువ శౌర్య లైఫ్ లో […]

3 min 14 views
కలియుగ మ(మా)యసభ Premium

కలియుగ మ(మా)యసభ – 19

అవి ఏవి పట్టించుకోని శ్రీపాద..”పనిచేస్తే కాళ్లు చేతులు నొప్పులు పుడతాయి, గుంజుతాయి మరి కోడల్ని పట్టుకొని మంచి చెడు ఆలోచించకుండా తిడుతుంటే నోరు నొప్పి పుట్టదా..!పాపం దానికి మాత్రం అలుపు రాదా…!” అని అన్నాడు శ్రీపాద ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ లేని కళ్ళతో తల్లిని చూస్తూ.       “చూస్తున్నాను రా.. దాన్ని నేను ఏమీ అన్నా నువ్వు నన్ను పరాయి దానిలాగా చేసి చూడడం నేను చూస్తూనే ఉన్నాను, అది నిన్ను దాని కోంగుకి కట్టేసుకుంది […]

3 min 11 views
కలియుగ మ(మా)యసభ Premium

కలియుగ మ(మా)యసభ – 20

“మీరు ఏం చేస్తున్నారో మీకైనా అర్థమవుతుందా.. ఇంట్లో ఆడవాళ్లు అన్నాక సవా లక్ష గొడవలు జరుగుతాయి, అందులోకి మీ మగవాళ్ళు ఎందుకు తలదూరుస్తారు.    చిన్నగా ఉన్నదాన్ని చిలికి చిలికి గాలి వాన చేసి ఒక కురుక్షేత్ర యుద్ధమే జరిగేలా చేస్తారు.” అని అంది ఏడుస్తూ శైలు.       “రాయితో కట్టిన గోడ అయితే తరాలు గడుస్తుంది ఆ ఇల్లు.. కానీ..! తడికలతో కట్టిన ఇల్లు చిన్న గాలి వానకి పోతుంది.    బంధాలు […]

3 min 10 views