ఆరోజు రాత్రి లాహిరి శౌర్యతో పాటు భోజనం చేసి శౌర్య పక్కనే పడుకుంది, ఎందుకంటే..!లహరికి ఊహ తెలిసే సరికి కస్తూరికి పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ అయిపోయింది సెకండ్ ప్రేగ్నెన్సీలో కాంప్లికేషన్స్ వల్ల బిడ్డ కడుపులోనే చచ్చిపోవడం వల్ల.
కాబట్టి శౌర్య లహరిని ఎప్పుడు కూడా తక్కువ చేసి చూడలేదు శౌర్య లహరికి సొంత అన్నయ్య కాదు అని ఫీలింగ్ ఎప్పుడూ ఎవరికీ కలగలేదు.
శైలు అమ్మకంటే ఒక మెట్టు ఎక్కువ శౌర్య లైఫ్ లో కానీ లహరి బిడ్డలాగే తనకి ఎప్పుడు..శౌర్య కంటే రెండు సంవత్సరాలు చిన్నది అయిన లహరికి ఎప్పుడు ఫ్రెండ్, ఫాదర్, బ్రదర్ రిలేషన్ శౌర్యతో ఉంది.
కౌసల్య కస్తూరి కి ఫోన్ చేసి చెప్పింది లహరి ఇక్కడే తిని పడుకుంది అని.
కస్తూరికి ఇది లహరి చిన్నప్పటి నుంచి అలవాటే కాబట్టి నార్మల్గా తీసుకుంది.