“మీరు ఏం చేస్తున్నారో మీకైనా అర్థమవుతుందా.. ఇంట్లో ఆడవాళ్లు అన్నాక సవా లక్ష గొడవలు జరుగుతాయి, అందులోకి మీ మగవాళ్ళు ఎందుకు తలదూరుస్తారు.
చిన్నగా ఉన్నదాన్ని చిలికి చిలికి గాలి వాన చేసి ఒక కురుక్షేత్ర యుద్ధమే జరిగేలా చేస్తారు.” అని అంది ఏడుస్తూ శైలు.
“రాయితో కట్టిన గోడ అయితే తరాలు గడుస్తుంది ఆ ఇల్లు.. కానీ..! తడికలతో కట్టిన ఇల్లు చిన్న గాలి వానకి పోతుంది.
బంధాలు కూడా అంతే.. అది తడిక అయితే అది ఊడిపోకముందే మనమే తీసేసి స్ట్రాంగ్ పిల్లర్ వేసి ఇల్లు కట్టాలి,అదే రాళ్లతో కట్టిన ఇల్లు అయితే మనము దానికి మరమ్మతులు చేయాల్సిన అవసరం కూడా లేదు.
బంధాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది.. నువ్వు ముందు నోరు కళ్ళు కట్టేసి ఫాస్ట్గా షవర్ చేసి రా.” అని అన్నాడు శైలుని ఎత్తుకొని బాత్రూంలో దించుతూ శ్రీపాద.