New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more

మౌనమే ని భాష

48 stories Ongoing Love Family Drama Suspense

నగరమంతా ఇంకా నిద్రమత్తులో ఉండగానే, శ్రావణి గదిలో చిన్న వెలుగు రేఖలు ప్రసరించడం మొదలయ్యాయి. సరిగ్గా తెల్లవారుజామున ఐదు గంటలు. అలారం మోగక ముందే శ్రావణి కళ్లు తెరిచింది. ఆమెకు అలారంతో పనిలేదు, ఆమెలోని క్రమశిక్షణే ఆమెను మేల్కొల్పుతుంది. మంచం మీద నుండి లేవగానే, తను పడుకున్న దుప్పటిని ఎక్కడా ఒక ముడత కూడా లేకుండా నీట్‌గా మడతపెట్టింది. ఆమె గది ఆమె మనసులాగే చాలా పద్ధతిగా ఉంటుంది.కిటికీ తెరలు జరిపి బయటకు చూసింది. తెల్లవారుజామున వచ్చే ఆ చల్లటి గాలి శ్రావణి ముఖాన్ని తాకినప్పుడు ఆమె పెదవుల మీద ఒక చిన్న మెరుపు లాంటి నవ్వు మెరిసింది. అది కేవలం ఆమెకు, ఆ ప్రకృతికి మాత్రమే తెలిసిన రహస్యం. గది మూలన ఉన్న చిన్న అల్మారాలో…

Browse Stories

మౌనమే ని భాష Premium

మౌనమే ని భాష – 31

వంశీ  చదువుతుంటే అతని చేతులు వణుకుతున్నాయి. శ్రావణీ.. పరుగెత్తు ఆగకు అని గదిలో అటు ఇటు తిరుగుతున్నాడు.   రాములు దాదాపు ఆమె దగ్గరకు వచ్చేస్తున్నాడు. వాడు ఊపిరి పీల్చుకునే శబ్దం కూడా ఆమెకు వినిపిస్తోంది. సరిగ్గా అప్పుడే శ్రావణికి ఒక పెద్ద ముళ్ల పొద కనిపించింది.    ఆమె ఆలోచించకుండా ఆ పొదల్లోకి దూరి తన నోరు చేతులతో గట్టిగా మూసుకుంది. ముళ్లు ఆమె ముఖాన్ని, చేతులను గుచ్చుకుంటున్నాయి కానీ ఆమె ఒక్క శబ్దం కూడా […]

4 min 32 views
మౌనమే ని భాష Premium

మౌనమే ని భాష – 32

కిటికీ బయట వర్షం కురుస్తోంది. ఆ చప్పుడు వంశీ గదిలోని నిశ్శబ్దాన్ని మరింత గంభీరంగా మారుస్తోంది.   వంశీ చేతిలో ఉన్న డైరీ పేజీలు గాలికీ రెపరెపలాడుతున్నాయి. శ్రావణి అనే ఆ అమ్మాయి తన జీవితంలోని నరకాన్ని దాటి,   ఆ రాత్రి పొలాల గట్ల మీద రక్తం చిందిస్తూ పరుగెత్తిన దృశ్యం వంశీ కళ్ల ముందు కదలాడుతోంది. వంశీ ఆత్రుతగా,   వణుకుతున్న వేళ్లతో తర్వాతి పేజీ తిప్పాడు. ఇది శ్రావణి తన ఊరి పొలిమేర […]

4 min 32 views
మౌనమే ని భాష Premium

మౌనమే ని భాష – 33

ఆఫీస్ పనులన్నీ ముగించుకుని ఇంటికి చేరుకున్న వంశీకి లోకం మీద దృష్టి లేదు. భోజనం కూడా సరిగ్గా చేయబుద్ధి కావడం లేదు.   అతని మనసంతా ఆ పాత డైరీ మీద, ఆ శ్రావణి జీవితం మీద ఉంది. రూమ్ లోకి వెళ్లి తలుపు వేసుకుని, బెడ్ మీద కూర్చుని ఆత్రుతగా డైరీ ఓపెన్ చేశాడు.   నిన్నటి ఎపిసోడ్ లో శ్రావణి బస్సు ఎక్కి ప్రాణాలతో బయటపడటం చదివిన వంశీకి, ఆ తర్వాత ఆమెకు ఈ […]

4 min 27 views
మౌనమే ని భాష Premium

మౌనమే ని భాష – 34

    వంశీకి ఇప్పుడు ఆ డైరీలోని తర్వాతి పేజీలు చదవాలని పిచ్చెక్కుతోంది. శ్రావణి అనాథగా ఒక కొత్త జీవితాన్ని ఎలా మొదలుపెట్టిందొ తెలుసుకోవాలి అని చాలా ఉత్కంఠ గా ఎదురు చూస్తున్నాడు….     నిశ్శబ్దంగా ఉన్న గదిలో వంశీ డైరీలోని అక్షరాల మధ్య తనని తాను వెతుక్కుంటున్నాడు.   శ్రావణికి ఆపదలో ఒక స్నేహితురాలు దొరికిందని తెలిశాక అతని మనసు కొంచెం తేలికపడింది. కానీ, ఆ స్నేహితురాలికి కూడా శ్రావణి అసలు నిజం తెలియదు […]

3 min 22 views
మౌనమే ని భాష Premium

మౌనమే ని భాష – 35

వంశీ గదిలో నిశ్శబ్దం ఉంది.తన కళ్ల ముందున్న డైరీలో శ్రావణి గతం నుండి వర్తమానంలోకి అడుగుపెడుతున్న తీరు అతన్ని మంత్రముగ్ధుడిని చేస్తోంది.    రాత్రి సమయం కావడంతో బయట గాలి హోరు వినిపిస్తోంది, కానీ వంశీ మనసంతా శ్రావణి స్నేహ ఇంటికి చేరుకున్న ఆ మొదటి రోజు మీదే ఉంది.   డైరీలో అక్షరాలు ఇప్పుడు కొంచెం కుదురుగా, స్పష్టంగా ఉన్నాయి. ఆకలి, భయం తీరిన తర్వాత శ్రావణి హృదయం నుంచి వచ్చిన మాటలు ఇవి.   […]

3 min 39 views
మౌనమే ని భాష Premium

మౌనమే ని భాష – 36

కిటికీ వెలుపల గాఢమైన చీకటి. వంశీకి ఇప్పుడు ఆ డైరీ చదవడం అనేది కేవలం ఒక అలవాటు కాదు, అది అతని జీవితంలో ఒక భాగమైపోయింది.    ఆఫీస్ నుండి రాగానే ఫ్రెష్ అయి, ఒక కప్పు కాఫీ పక్కన పెట్టుకుని, శ్రావణి ప్రపంచంలోకి అడుగుపెట్టడం అతనికి ఒక అనిర్వచనీయమైన అనుభూతిని ఇస్తోంది.   ఈరోజు డైరీ తెరిచిన వంశీకి, అందులోని అక్షరాలు కన్నీటి చారలతో తడిసినట్టు అనిపించాయి.   డైరీలో శ్రావణి తన తల్లితో మనసు […]

3 min 36 views
మౌనమే ని భాష Premium

మౌనమే ని భాష – 37

వంశీ తన గదిలో ఒంటరిగా కూర్చుని ఉన్నాడు. బయట గాలి హోరు వినిపిస్తోంది, కానీ అతని మనసులో అంతకంటే పెద్ద తుపాను రేగుతోంది.    టేబుల్ మీద ఉన్న డైరీ వెలుగులో మెరుస్తోంది. నాలుగేళ్ల శ్రావణి జీవితాన్ని,    ఆమె అనుక్షణం అనుభవించిన నరకాన్ని చదివిన వంశీకి ఇప్పుడు ఆ డైరీలోని ఆఖరి పేజీలు మిగిల్చిన శూన్యం భరించలేనంతగా ఉంది.   వంశీ వణికే చేతులతో డైరీలోని ఆఖరి పేజీని తిప్పాడు. ఆ పేజీ తర్వాత డైరీ […]

3 min 24 views
మౌనమే ని భాష Premium

మౌనమే ని భాష – 38

వంశీ తన గదిలో ఒంటరిగా కూర్చుని ఉన్నాడు. బయట గాలి హోరు వినిపిస్తోంది, కానీ అతని మనసులో అంతకంటే పెద్ద తుపాను రేగుతోంది.    టేబుల్ మీద ఉన్న డైరీ వెలుగులో మెరుస్తోంది. నాలుగేళ్ల శ్రావణి జీవితాన్ని,    ఆమె అనుక్షణం అనుభవించిన నరకాన్ని చదివిన వంశీకి ఇప్పుడు ఆ డైరీలోని ఆఖరి పేజీలు మిగిల్చిన శూన్యం భరించలేనంతగా ఉంది.   వంశీ వణికే చేతులతో డైరీలోని ఆఖరి పేజీని తిప్పాడు. ఆ పేజీ తర్వాత డైరీ […]

3 min 21 views
మౌనమే ని భాష Premium

మౌనమే ని భాష – 39

గుడిలో గంటల నాదం ప్రతిధ్వనిస్తోంది. చుట్టూ భక్తుల కోలాహలం ఉన్నా, శ్రావణి మనసు మాత్రం ఆ అపరిచిత మహిళ మీదనే ఉంది.   దూరం నుండి ఆవిడను చూస్తున్న శ్రావణికి ఏదో తెలియని అలజడి. ఎవరీవిడ? ఎక్కడో చూశాను..    ఆ రూపం, ఆ నడక.. అంతా పరిచయంగానే ఉందే అని తనలో తాను మథనపడుతూ కూర్చుంది.   శ్రావణి ఆలోచనల్లో ఉండగానే, ఆ మహిళ శివాలయ మెట్ల వైపు నడుచుకుంటూ వెళ్తోంది. ఆ మెట్లు కొంచెం […]

4 min 31 views
మౌనమే ని భాష Premium

మౌనమే ని భాష – 40

గోపాల్ గారి ఇల్లు ఒక నిశ్శబ్ద సముద్రంలా ఉంది. సరస్వతి గారు సోఫాలో కూర్చుని తన కాలి నొప్పిని భరిస్తూనే శ్రావణిని ఎంతో ఆప్యాయంగా చూస్తున్నారు.   శ్రావణి తన మనసులోని భయాన్ని అణచుకుని అక్కడ కూర్చుని ఉంది.   సరస్వతి గారు శ్రావణి చేతిని పట్టుకుని ఎంతో బతిమాలారు. అమ్మా, గుడిలో నా ప్రాణం కాపాడావు.   మొహం చూద్దామంటే ఈ మాస్క్ కట్టుకున్నవ్, ఈ ముసుగు ఎందుకు తల్లి? ఇంట్లోనే ఉన్నావు కదా, ఒక్కసారి […]

3 min 31 views