Villan
జోరున వర్షం కురుస్తూ ఉంటే ఒక అమ్మాయి పరిగెత్తుకుంటూ గుడికి వెళుతుంది.....ఆయాస పడుతూ టెన్షన్ పడుతూ పరిగెత్తుకుంటూ గుడి లోపలికి వెళ్లి పూజారి కోసం వెతుకుతూ ఉంటుంది.....అప్పుడే పూజారి గుడి మూసే సమయం అవడంతో తలుపులన్నీ మూయడానికి...సిద్ధంగా ఉండి తాళాలు తీసుకుని బయటికి వస్తూ కనిపిస్తాడు....అమ్మాయిని చూసి పూజారి దగ్గరకు వచ్చి ఎవరమ్మా నువ్వు ఈ సమయానికి గుడికి వచ్చావ్ ఇప్పుడు గుడి మూసే సమయం .... పొద్దున వచ్చి దైవ దర్శనం చేసుకో అమ్మ టైం అయిపోయింది గుడి మూసేస్తున్నాను బయటికి వెళ్తే మూసేస్తాను అని అంటాడు పూజారి.....పూజారి గారు దయచేసి గుడి ముయోద్దండి మా నాన్నగారి పరిస్థితి అసలు బాగోలేదు దైవదర్శనం చేసుకోవాలనుకుంటున్నాను అలాగే మీరు పూజ చేయరా ప్లీజ్…