నేను బాగానే ఉన్నాను అంకుల్ …! అని చెప్పి ,… జరిగిన ఆక్సిడెంట్ గురుంచి మొత్తం చెప్తాడు పూర్ణివ్.
” అయ్యో ఇంత జరిగిందా…..! ఇప్పుడు ఆ అమ్మాయికి ఎలా ఉంది..? నేను ఇప్పుడే హాస్పటల్ కి వస్తున్నా….. ” అని చెప్పి కాల్ కట్ చేసి హాస్పటల్ కి స్టార్ట్ అయ్యారు నాగేంద్ర గారు..
చైర్ లో కూర్చుని ఉన్న పూర్ణివ్ తల అంతా మొద్దు బారిపోయినట్టు అనిపిస్తూ ఉంటే…..తల పట్టుకొని అలాగే వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు…