New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
అగ్నిసాక్షి 🔥 – 10

అగ్నిసాక్షి 🔥 – 10

“నాకు పుట్టే బాబు లేదా పాపకి మీరిద్దరూ తల్లిదండ్రులు అవ్వగలుగుతారా??”

 

ఆ వాక్యం చదివిన యష్ ఒక్కసారిగా ఆగిపోయాడు. అతడి చూపు ఆ అక్షరాల మీదే నిలిచిపోయింది. వేద తమ ఇద్దరినీ తన బిడ్డకు తల్లిదండ్రులుగా ఉండమని అడుగుతుందని అస్సలు ఊహించలేదు.

 

“యష్… ఇదేంటి ఇలా రాసింది? తన హస్బెండ్ ఎక్కడ? మనం వచ్చిన దగ్గర నుంచి అమ్మ వాళ్లు, ఆంటీ వాళ్లే కనిపించారు కానీ తను ఎక్కడ కనిపించలేదు.”

 

ఆరు ప్రశ్నలు అడుగుతూనే యష్ వైపు చూసింది. అతడి ముఖంలో కనిపిస్తున్న ఆందోళన ఆమెకు మరింత అనుమానాన్ని కలిగించింది.

 

“వీడిని వాళ్ల నాన్న చూసుకోలేడా?” అంటూ తన ఒడిలో ఉన్న బాబు చేతిని పట్టుకొని యష్‌నే చూస్తూ అడిగింది.

 

“తెలీదు” అని యష్ నుంచి వచ్చిన సమాధానం ఆరుకి మరిన్ని ప్రశ్నలను తీసుకొచ్చింది.

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue