మన ఇంట్లో ఉన్నంత నీట్ గా ఉన్నా వాష్ రూమ్ నీ చూశాక మెయింటినెన్స్ బాగుంది రూమ్ కూడా చాలా బాగుంది 22k తీసుకోవడంలో అసలు తప్పు లేదు లే కానీ ఫుడ్ ఎలా ఉంటుందో అని ఆలోచిస్తూనే ఫ్రెష్ అయ్యి వచ్చిన స్వర్ణ కి అప్పుడే రూమ్ లోకి వస్తూ కనిపించింది అమృత..
చిరునవ్వు తోనే పరిచయాలు అయ్యాక అమృత కూడా ఫ్రెష్ అయ్యాక ముగ్గురు కలిసి డిన్నర్ కి వెళ్తారు…
ఫుడ్ ఎలా ఉంటుంది టేస్టీ గా ఉంటుందా అని అడిగింది స్వర్ణ..
తినబోతు రుచి ఎందుకు అడగడం.. అదేదో నువ్వే రుచి చూసి చెప్పు అనగానే సరే అని ప్లేట్ తీసుకొని అక్కడ ఉన్న ఫుడ్ ఐటమ్స్ చూసి షాక్ అయి ఏంటి ఇన్ని రకాల డిషెస్ హా అంది