వెళ్లి రాజేశ్వరి గారు ఇంద్ర రూమ్ డోర్ కొడితే…. తలుపు తీసిన ఇంద్ర రాజేశ్వరి గారిని చూసి ఏంటి అన్నాడు…
నిన్ను పిన్ని పిలుస్తుంది బాబు అంది
వస్తున్నాను వెళ్ళు అని డోర్ క్లోజ్ చేసి ఫ్రెష్ అవ్వడానికి వాష్ రూమ్ కి వెళ్ళాడు..
షవర్ కింద నిల్చున్న ఇంద్ర కి మొన్న ధర్మ చెప్పిన మాటలే గుర్తుకు వస్తుంటే ఇప్పుడు నానమ్మ నన్ను అడుగుతుందేమో స్వర్ణ ఎక్కడికి వెళ్ళింది అని… లేదా ఇంట్లో ప్రేమించుకుంటున్నాం అని చెప్పిన విషయం తెలిసి పిలుస్తుందా… ఇప్పుడు నానమ్మ నేనేం సమాధానం చెప్పాలి అనుకొని స్నానం పూర్తి చేసి బయటకి వచ్చేసాడు..
టిఫిన్ తినడానికి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్న అనసూయ మనవడు ఇంద్రజీత్ కోసం ఎదురు చూస్తుంటే… స్వర్ణ ఇంద్ర ప్రేమించుకుంటున్నారు త్వరలోనే పెళ్లి చేసేద్దాం అని అత్తయ్య గారితో చెప్పేయండి అని దేవయాని గారు రఘునాథ్ గారితో చెప్తారు…