స్వర్ణ అనే కోపంగా చూస్తున్న కోయెల్ ని చూసి మరొక వర్కర్ పిలిచి వెళ్లి వర్క్ చూడు అక్కడ నుంచి మేనేజర్ చూస్తున్నాడు అని చెప్పింది
కోపంగా కాలు ని నేలకేసి కొడుతూ వెళ్లి తన టేబుల్స్ ని క్లీన్ చేయడం స్టార్ట్ చేసింది కోయెల్…
ఇందాక పిలిచినా అమ్మాయే మళ్ళీ పిలిచి ఇన్ని రోజులుగా నీకు కాంపిటీషన్ లేరు కాబట్టి ఆ బ్యాడ్జి నీది అయింది ఇప్పుడు నీకు ఆ స్వర్ణ కాంపిటీషన్ గా వచ్చింది కాబట్టి ఇప్పుడు నీ బిహేవియర్ ఇలానే ఉంటే నెక్స్ట్ వీక్ కూడా ఆ బ్యాడ్జ్ తనదే అవుతుంది అని చెప్పే సరికి మనసులో కోపం ఉన్నా పైకి నవ్వుతూ సరే అని పని చూసుకుంది…
ఎవరు ఎలా విసిగించినా ఎదురు చెప్పకుండా చేయడం స్వర్ణ కి మొదటి నుండి అలవాటే కాబట్టి తను అలానే ఉంటే గుడ్ బిహేవియర్ బ్యాడ్జ్ కోసం కోయెల్ నవ్వు నటిస్తూ సర్దుకు పోతుంది…