సరే బామ్మ గారు ఇంట్లో ఆకు కూర లేదు తెప్పించండి నేను వెళ్లొస్తను బామ్మా గారు అనడం తో సరే అని గిరీషానికి కూడా జాగ్రత్త అని చెప్పి… అమ్మాయ్ స్వర్ణ అసలు విషయం మరిచిపోయానమ్మ… రేపు కొంచెం చీరలో రామ్మా ఇంట్లో పూజ ఉంది…
అలాగే బామ్మా గారు అని కార్ లో స్టార్ట్ అయిన స్వర్ణ ఆలోచనలు అస్థవ్యస్తంగా తిరుగుతూనే ఉన్నాయి…. తల్లి ని చూడాలని మనసు తపించి పోతుంది… కళ్ళు మూసుకొని సీట్ లో వెనక్కి వాలింది…
కంటి కొనల నుండి కన్నీరు జారి కణతల్లో నుండి జుట్టులోకి ఇంకి పోతుంది
మరుసటి నాటి నాడు భానుమతి గారు చెప్పినట్టుగా చిలక పచ్చని జర్జీయేట్ శారీలో కాంట్రస్ట్ గా పింక్ బ్లౌజ్ లో పూజ అని చెప్పడం తో హెడ్ బాత్ చేసి హెయిర్ లీవ్ చేసిన చీరకి తగ్గట్టు గాజులు కూడా వేసుకొని చక్కగా పద్దతిగా బొట్టు పెట్టుకొని తెలుగింటి ఆడపడుచులా తయారయ్యి వచ్చిన కార్ లో ఎక్కింది…