రెండు రోజుల తర్వాత మధ్య రాత్రి ఒక్కసారిగా పెయిన్స్ వస్తాయి అప్పికి వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్తారు.
మార్నింగ్ 6:00 అప్పికి పాప పుడుతుంది చాలా అందంగా ఉంది మొత్తం శ్రీధర్ పోలికలే… అంటూ ఉంటారు చుట్టూ ఉన్న వాళ్ళ మామయ్య ఇంకా చుట్టాలు అప్పికి మేలుకువచ్చేసరికి…
ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతారు అందరూ “పర్లేదు అత్తయ్య” అంటుంది నీరసం అప్పి
అప్పి నీకు పాపపుట్టిందే అని చెప్తుంది వాళ్ళపెద్ద అత్త..
తను నవ్వి…ఉయ్యాల వైపు చూస్తుంది అది ఖాళీగా కనిపించడంతో
అప్పి పాప కొంచెం వీక్ ఉందని బాక్సులో పెట్టారు… ఇంకో రెండు గంటల్లో పంపిస్తారు పక్కనే మేము వెళ్లి చూసి వచ్చాము