పూజ మొదలు అయ్యింది….ఇద్దరు కలిసి ఎంతో నిష్ఠగా చేయడం మొదలు పెట్టారు…. వ్రత కథ విన్నారు…. అలా ఉండగా జనని నిద్ర ఆపుకోలేక పోయింది….
అనుకోకుండా తూలుతు తూలుతు అజిత్ భుజం మీద తల వాల్చింది…. అది చూసిన అందరు ఆశ్చర్య పోయి లేపబోతే…. అజిత్ చెయ్ ఎత్తి ఆపేసాడు….
పంతులు గారు అయ్యా అమ్మాయిని లేపండి అని చెప్తే…. ఇది నేను చేసిన తను చేసిన ఒకటే కదా…. హ అంతే మీ ఇద్దరు ఇప్పుడు ఆలుమగలు గా మారాక ఇద్దరు ఒకరిలో ఒకరే….
హ తన బదులు నేను చేస్తాను పర్లేదు కానివ్వండి అన్నాడు…. తన చేతిలో ఉన్న అక్షింతలు మెల్లగా తీసుకొని కాసేపు చెంపల మీద చెయ్ పెట్టి జో కొడుతూ ఉన్నాడు….
అది చూసిన అందరు మురిసిపోతు చూస్తున్నారు జంట ని…. అంతా అయ్యాక అమ్మాయి అమ్మ నాన్న లు వచ్చి ఇద్దరికి వస్త్రాలు పెట్టండి అన్నప్పుడు రమణి గారు వచ్చి లేపారు జనని ని….
ఒక్కసారిగా ఉలిక్కి పడి లేచింది…. అందరిని చూసి ఇబ్బందిగా నవ్వి సరిగ్గా కూర్చుంది…. రమణి గారు రాజారామ్ గారు ఇద్దరు వచ్చి బట్టలు పెట్టి ఆశీర్వదించి పక్కకి వెళ్ళాక….