కొడుకు గురించి ఇంతమంది ఎంకరేజ్ చేస్తూ, పొగుడుతూ ఉంటే జగదీశ్వరి గారికి, ప్రకాష్ గారికి ఆనందానికి అవధులు లేకుండా పోతాయి. సత్య, సుప్రియ, పిల్లలు, పెద్దవాళ్లు అందరూ కూడా అఖిల్ డాన్స్‌ని ఎంతో ఎంజాయ్ చేస్తూ ఉంటారు.
అలా ఒక్కొక్కరు డాన్స్ చేసి ముగించుకున్న తర్వాత జడ్జెస్ ఐదుగురిలో ముగ్గురిని ఫైనల్ రౌండ్‌కి సెలెక్ట్ చేస్తారు. ఆ ముగ్గురిలో అఖిల్ కూడా ఉండడంతో ఇంట్లో వాళ్లందరూ ఇంకా సంతోషపడిపోతారు. “మన అఖిల్ ఫస్ట్ వస్తే చూడాలి” అని జగదీశ్వరి గారు, ప్రకాష్ గారు ఎంతో ఆశగా ఎదురుచూస్తూ ఉంటారు.
ఇక లాస్ట్‌కి ఫైనల్ విన్నర్ ఎవరో అనౌన్స్ చేసే సమయం వస్తుంది. యాంకర్ మైక్ పట్టుకుని, “అండ్ ది విన్నర్ ఆఫ్ సిటీ డాన్స్ కాంపిటీషన్ ఈజ్…” అంటూ కాసేపు అందరినీ ఉత్కంఠగా చూస్తుంది.
“అఖిల్ దేవ్!” అని అనౌన్స్ చేస్తుంది.
అంతే… అక్కడున్న వాళ్లందరి సంతోషానికి అవధులు లేకుండా పోతాయి. సత్య ఆనందంతో చప్పట్లు కొడుతూ ఉంటే, జగదీశ్వరి గారు కన్నీళ్లతో కొడుకుని చూస్తూ ఉంటారు. ప్రకాష్ గారు కూడా కొడుకు గెలిచాడన్న గర్వంతో ఎంతో సంతోషపడతారు.
పిల్లలు అయితే కేకలు వేస్తూ, “డాడీ విన్ అయ్యాడు… డాడీ విన్ అయ్యాడు!” అంటూ అక్కడే ఎగిరి గంతులు వేస్తారు. సుప్రియ కూడా సత్యని హగ్ చేసుకుని, “నీ వల్లే వదినా… నిజంగా నీ వల్లే” అని సంతోషంగా చెబుతుంది.