వాడు మాత్రం నా మాట పట్టించుకోకుండా వెళ్ళి తలుపు వేసి నన్ను బెడ్ మీద కూర్చోబెట్టి నాకు ఎదురుగా కూర్చుని…అసలు బుద్ధి ఉందా..కనీసం బయటకు వెళ్ళినపుడు ఒక మాటా చెప్పాలి అని తెలియదా అని ఫుల్ కోటింగ్ ఇచ్చాడు నాకు..
నేను మాత్రం ఏడుపు మొహం పెట్టుకుని అలానే చూసాను వాడి వైపు
అలానే అప్పుడు అలిగితే.. వాడు బెడ్ దగ్గర కింద కూర్చుంటూ నా కళ్ళు నొక్కుతూ..అలా కాదు జున్నమ్మ..బయట రోజులు అసలు బాలేదు కదా..ఇలా నువ్వు చెప్పకుండా వెళ్ళిపోతే నీ కోసం ఎంత మంది ఇంట్లో కంగారు పడతారో ఆలోచించావా ఒకసారైనా.. ఈ సారి నుంచి నీకు ఎక్కడికైనా వెళ్ళాలి అనిపిస్తే నాకు చెప్పు నేను తీసుకుని వెళ్తాను..పోనీ వెళ్తున్నట్టు నాకు ఇన్ఫార్మ్ చేయి అంటూ ఎంత బాగా చెప్పాడో..
అప్పట్లో నాకు ఉన్న మెచ్యూరిటీ కి సరే నువ్వు ఎలా చెప్తే అలానే అని మంచిగా చెప్పేసి..థ్యాంక్ యూ సో మచ్ రా అని చెప్పాను వాడికి)
(వీడికి కోపం ఎంత ఎక్కువో..ప్రేమ అంతకన్నా ఎక్కువే….ఒక మాట ఉంటది అండి..కోపం ఎక్కువ ఎవరైతే చూపిస్తారో..ఎక్కువ ప్రేమను కూడా వాళ్ళే అందిస్తారు)..
అవును కోపం అంటే గుర్తు వచ్చింది..వీడు ఇప్పుడు కోపంగా ఉన్నాడు కదా..అదే నా మీద అలిగాడు కదా.. ఆ విషయమే మర్చిపోయాను నేను..ఇంతకీ వీడికి ఫోన్ మాట్లాడటం ఇంకా అవ్వలేదా..కొంపతీసి గర్ల్ఫ్రెండ్ అహ్?? అని అనుకుంటూ