“ఏంటోనే మీ పెద్దవాళ్ల పట్టింపులు పంతాలు, ఆఖరికి మా మీద కూడా చూపిస్తూ ఉంటారు.” అని అంది నీటూర్పుగా లహరి.
“తల్లిదండ్రుల ఆస్తులు ఎలా పంచుకుంటామో వాళ్ళు చేసిన పాపపుణ్యాలు కూడా అలాగే పంచుకోవాలి, ఆఖరికి పంతాలు పట్టింపులు కూడా.” అని నవ్వింది పక్కన కూర్చున్న వేద లహరిని చూస్తూ.
“కొంతమంది ఆస్తులు ఇవ్వకపోయినా వాళ్ళు చేసిన పాపపుణ్యాల ప్రతిఫలం ఇచ్చి వెళ్తారు వేద.” అని నవ్వింది కౌసల్య.