New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
నా సీత ప్రేమకై💕 – 2

నా సీత ప్రేమకై💕 – 2

పార్ట్ – 2

 

“రేయ్! రాము నిజం తెలుసుకోకుండా ఏదీ మాట్లాడకు. వాడు ఆ గోపి గాడు కావాలనే వచ్చి సీతను గెలుక్కున్నాడు. అక్కడికి తను చాలా ఇగ్నోర్ చేయాలనే ప్రయత్నించింది ఆఖరికి తనని ఎంత హీనంగా, నీచంగా మాట్లాడిన సైలెంట్ గా తప్పించుకుని వెళ్ళిపోదామనే చూసింది. కానీ తన అడుగులు ఎక్కడ ఆగిపోయాయో తెలుసా…” అనగానే మనోహర్ వైపే తలెత్తి చూసాడు రాము.

 

వాడి చూపులను చూసి, “తనని ఎంత నీచంగా మాట్లాడినా పట్టించుకోకుండా వెళ్ళేది కాస్త వాడు నీ ప్రస్తావనని మధ్యలోకి తీసుకురావడంతో తన అడుగులని ఆపేసింది. తనని ఎంత రెచ్చగొట్టాలని చూసినా తను రెచ్చిపోలేదు అనేసి కావాలనే నీ పేరుని లాగాడు బయటికి. ఆ మాటలకి సీత వాడి వైపు కోపంగా చూస్తుంటే ‘అమ్మో పాపకి కోపం వచ్చింది రోయ్ ప్రియుడిని అంటే. ఇప్పుడు ఏం చేస్తుంది అంటారు..?’

 

‘ఏం చేస్తుంది పోయి వాడికి చెప్తుంది వాడొచ్చి పశువులాగా మనందరినీ కొట్టి పడేస్తాడు. వాడి ముఖానికి అది తప్తే ఇంకేం వచ్చు. చదువా పాడా.’

 

అంటూ నువ్వు ఎందులో అయితే వీక్ గా ఉన్నావో అందులోనే దెబ్బ తీశారు. ఆ మాటలని సీత తీసుకోలేకపోయింది. వారి వైపు కోపంగా చూస్తుందే కానీ ఒక్క మాట నోరు తెరిచి మాట్లాడలేదు అప్పటికీ వారు అనుకునేది జరగలేదు అనేసి కావాలనే ఈ పందెం వాళ్లే వేశారు.

 

‘ఏంటి పాప చదువు పేరు వినగానే భయం వేసిందా..? ఎలాగో నీ ప్రియుడికి అది రాదుగా’ అంటూ వెకిలిగా నవ్వుతూ, ‘లుక్ నన్ను కాదని వాడి దగ్గరికి వెళ్లావు కదా. నీ వాడు నన్ను మించినవాడు అవ్వగలడా చదువుల్లో..? పందెం వేసుకుందామా..? ఈ పందెంలో మీ వాడు గెలిస్తే ఇకపై నిన్ను ఎప్పుడు హరాస్ చేయను. అండ్ ఇన్నేళ్లుగా కొట్టుకుంటున్న మన ఫుట్బాల్ గ్రౌండ్ కూడా మీ గ్రూప్ కి ఇచ్చేస్తాము. ఎలాగో మిమ్మల్ని ఆడిపించడం లేదు అనేసి తెగ బాధపడుతున్నారు కదా. ఏమంటావు..?’

 

‘అయినా వాడు ఫస్ట్ నీతో గెలవాలి కదా అన్న’ అంటూ సీతను కావాలనే రెచ్చగొట్టటం కోసం అన్నాడు ఇంకొకడు.

 

వాడి మాటలకు వెకిలిగా పగలపడి నవ్వాడు గోపి.

 

ఇంతలో, “పందెం ఏంటి..?” ఒక్క మాటే అడిగింది సీత.

 

“మీ వాడిని నాతో పాటు ఒక్క పరీక్షలో పాస్ అవ్వమని చెప్పు. కావాలంటే ఈ పోటీని నేనే పర్సనల్గా ప్రిన్సిపల్ సార్ కి రికమెండ్ చేసి మరీ నేనే పెట్టిస్తాను. గెలిచిన వారికి ప్లే గ్రౌండ్ అలాగే మీవోడు సారీ సారీ ఎలాగో గెలవడు కదా సో నేను మొనగాడిని అయిపోతాను కాలేజ్ అందరి దృష్టిలో. ఏమంటావు పందెంకి ఓకేనా..?”

 

అంటూ వాడు రెచ్చగొట్టడంతో ఇప్పటికే ప్లే గ్రౌండ్ కోసం మనం ఎన్ని సార్లు తనకలాడమో మనకి బాగా తెలుసు రా. ముఖ్యంగా నువ్వు నీకు ఫుట్బాల్ అంటే పిచ్చి. అటువంటిది కాలేజీలో వాళ్ళు నిన్ను ఆడనీకుండా కావాలనే గొడవలు పెట్టుకుంటుంటే అది చూసి తట్టుకోలేకపోయింది. అందుకని తప్పక బెట్ కట్టింది.”

 

మనోహర్ చెప్పే ఈ మాటలు ఏవి తన చెవిన చేరటం లేదు సీతను వాళ్లు నీచంగా మాట్లాడారు అన్న మాటల దగ్గరే వాడి ఆలోచనలు అన్నీ ఆగిపోయాయి.

 

వాడిని గమనించిన చరణ్, “రేయ్ ఏమైంది అలానే ఉండిపోయావు?” అంటూ తట్టి పిలిస్తే గాని ఈ లోకంలోకి రాలేదు.

 

ఈ లోకంలోకి వచ్చిన మరుక్షణం, “సీతను వాడు ఏమన్నాడు..?” మూడే ముక్కల్లో ఒక్కొక్క పదంగా వస్తున్న కోపాన్ని అణుచుకుంటూ మరి అడిగాడు రాము.

 

“ఉఫ్… రేయ్ ఇందులో మెయిన్ మ్యాటర్ పట్టించుకోకుండా ఏదేదో పట్టించుకుంటావ్ ఏంట్రా.”

 

అంటున్న మనోహర్ కాలర్ పట్టుకుని, “మీకు మిగతాది మెయిన్ అవ్వచ్చు నాకు అదే మెయిన్ చెప్పండి వాడు దాన్ని ఏమన్నాడు..?”

 

“అది చెప్పాలంటే నువ్వు ముందు ఈ పోటీలో పాల్గొనాలి. మరి పాల్గొంటావా?” తనతో ఎలాగైనా ఈ పోటీలో పాల్గొనేలా చేయాలి అనేసి లోపల నుంచి వస్తూనే స్థిరంగా అడిగింది సీత.

 

అది చూసి, “నాకు కోపం తెప్పించకు సీత మర్యాదగా వాడు ఏమన్నాడో చెప్పు.”

 

“చెప్తే ఏం చేస్తావ్ రా? పోయి వాళ్ళని చావగొట్టి వస్తావా? ఇది తప్పితే నీకు ఇంకేం తెలియదా? రౌడీవా స్టూడెంట్ వా నువ్వు? హా..! ఫుట్బాల్ ప్లేయర్ వి అవ్వాలనుకుంటున్నావా లేక జైలుకి వెళ్లాలనుకుంటున్నావా?”

 

“నాకు అవన్నీ అనవసరం సీత ముందు అది చెప్తావా చెప్పవా?”

 

ఎంత చెప్పినా తన మొండి పట్టు వదులుకుంటుంటే, “చెప్పను ఎప్పటికీ చెప్పను” అనిందో లేదో కోపంగా దాని గొంతు పట్టుకున్నాడు రాము.

 

అయినా కూడా ఎటువంటి జంకూ లేకుండా, “పోటీలో పాల్గొంటాను అని చెప్పు కచ్చితంగా నువ్వు గెలిచిన మరుక్షణమే మొత్తం చెప్తాను” గొంతు పైన వాడి ఘాటు వేలి ముద్రలు ఎర్రగా తగులుతున్నా ఎంతో స్థిరంగా మాట్లాడుతున్న తన మాటలకి రాము వెనక్కి తగ్గక తప్పలేదు.

 

ఇంకా ఉంది…

 

రాము ఈ పోటీని ఒప్పుకుంటాడా?

గోపీతో పోటీ పడి రాము గెలవగలడా?

 

నా కథ నచ్చితే చిన్న కామెంట్ చేసి నన్ను సపోర్ట్ చెయ్యండి.. కథలంటే ఇష్టం ఉన్న వాళ్ళకి నా కథను షేర్ చేసి వాళ్ళ అభిప్రాయాలను ఒక చిన్ని కామెంట్ రూపంలో చెప్పమని చెప్పండి.. మీ కామెంట్స్ ఏ మా రైటర్స్ కి వచ్చే బూస్ట్ అప్ దాని ద్వారా మేము మరింత ఉత్సాహంతో కథలను రాయగలుగుతాం..

 

నన్ను సపోర్ట్ చేస్తారాని ఆశిస్తూ…

 

ఇట్లు

మీ కీర్తి💕