New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
నా సీత ప్రేమకై💕 – 3

నా సీత ప్రేమకై💕 – 3

భాగం – 3

 

అయినా కూడా ఎటువంటి జంకూ లేకుండా, “పోటీలో పాల్గొంటాను అని చెప్పు కచ్చితంగా నువ్వు గెలిచిన మరుక్షణమే మొత్తం చెప్తాను” గొంతు పైన వాడి ఘాటు వేలి ముద్రలు ఎర్రగా తగులుతున్నా ఎంతో స్థిరంగా మాట్లాడుతున్న తన మాటలకి రాము వెనక్కి తగ్గక తప్పలేదు.

 

“నీకు అర్థం కావట్లేదు సీత నీకు తెలియదా నేను చదువులో వీక్ అని” అని రాము అసహనంగా అంటుంటే,

 

“విద్యా కుసుమం ఎన్నటికీ వాడదు రా. అది అందరిలో అలానే చిగురిస్తూనే ఉంటుంది. నీలో కూడా ఉంటుంది దాన్ని బయటికి తీయాలి అంతే. కష్టపడి కాదు ఇష్టపడి చదివి చూడు ఇందులో కచ్చితంగా విజయం నీదే అవుతుంది. నీ గురించి తెలిసి కూడా ఈ పోటీకి బెట్టు కట్టాను అంటే అక్కడే అర్థం అవ్వటం లేదా నేను ఎంత స్థిరంగా నిన్ను ముందుకు నడిపించాలి అని చూస్తున్నానో.”

 

చెప్పిన తన మాటలకి మూడు క్షణాల పాటు తన కళ్ళల్లోకి చూస్తూ, “ఒకవేళ నేను ఈ పోటీలో గెలవకపోతే నాకు ఏమీ చెప్పవా..?” కోపాన్ని తగ్గించుకొని మెల్లగా అడిగాడు రాము.

 

వాడి మాటలకి ఒకే ఒక్క మాట, “చెప్పను” ఇది కూడా స్థిరంగా పలికింది సీత.

 

“సరే అయితే నేను ఈ పోటీకి ఒప్పుకుంటున్నాను. వాళ్ల కోసమో వీళ్ళ కోసమో ఇంకెవరి కోసమో కాదు నీకోసం కేవలం నీకోసం మాత్రమే” అంటూ అప్పటికి కాస్త ప్రేమగా బాధగా తన వైపే చూస్తూ, “చెప్పండి ఏం చేయాలి..?” అన్నాడు.

 

ఆ మాట చెప్పగానే, “వావ్ నిజంగా నువ్వు ఒప్పుకున్నావా రా” అంటూ ఫ్రెండ్స్ అంతా కేరింతలు కొట్టేశారు.

 

సీత మనసు సంతోషించింది.

 

అసలు పోటీకే ఒప్పుకోడు అనుకున్న గోపి గ్యాంగ్ అంతా రాము పోటీకి ఒప్పుకున్నాడు అనగానే కాస్త షాక్ అయినా, “వాడి ముఖానికి ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా చదువు అనే స్పెల్లింగ్ కూడా చేత కాదు ఇంకా నన్నేం ఓడిస్తాడులే” అంటూ ధీమాగా ఉండిపోయాడు గోపి.

 

ఇక స్టార్ట్ అయింది మొత్తం గ్రూప్ గ్రూప్ అంతా కలిసి రాముకి తను రాయబోయే పరీక్షలో సహాయం చేస్తూ ఉన్నారు.

 

మధ్య మధ్యలో తను డీలా పడుతున్న ప్రతిసారి సీత తనని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తూ మరి చదివిస్తూనే ఉంది. తన మీద ఉన్న ప్రేమతోనే కసిగా తన సహాయంతో అప్పటి వరకు బుక్కు కూడా ముట్టనివాడు బుక్కులు బుక్కులు తీసుకొని చదవటం మొదలు పెట్టాడు.

 

అవతల గోపి వాడు ఆల్రెడీ చదువులో ముందున్నాడు అన్న ధీమాతో అలాగే రాముకి అంత చేతకాదు అన్న పొగరుతో గర్వంగా ఒక రోజు ముందు మాత్రమే చదువుకొని పరీక్షకు హాజరయ్యాడు.

 

మొత్తానికి పోటీ రోజు రానే వచ్చింది. ఇద్దరు హేమా హేమీల్లాగా ఒకరిని ఒకరు కోపంగా చూసుకుంటూనే ప్రిన్సిపల్ ముందర పరీక్ష మొదలు పెట్టారు.

 

లోపలికి వెళుతున్న రాము చెయ్యి పెట్టి ఆపేసి ప్రేమగా తన నుదుటిన ముద్దు పెట్టి, “ఆల్ ది బెస్ట్ రా.”

 

తన ఆ చిన్న ముద్దుకే వెయ్యి ఏనుగుల బలం తనకి వచ్చేసినంత సంబరంతో తననే చూస్తూ, “ఇచ్చిన మాట మర్చిపోకు రా. విజయవంతంగా నా పని ముగించుకొని వస్తాను” అంటూ ప్రేమగా తన బుగ్గ తీసుకొని ముద్దు పెట్టుకుంటూ లోపలికి వెళ్ళిపోయాడు రాము.

 

పరీక్ష మొదలైంది, బయట అందరూ ఎంతో ఉత్కంఠ భరితంగా ఎదురు చూస్తున్నారు.

 

లోపల వ్రాసే వారి కన్నా బయట ఎదురు చూసే వారికే ఉత్సాహం ఆత్రుత ఎక్కువైపోతుంది. సమయం గడుస్తూ గడుస్తూ పోయింది. మొత్తానికి పరీక్ష ముగిసింది.

 

ఇద్దరు వారి పరీక్ష పేపర్లను సార్ ముందర పెట్టి బయటకు వచ్చేశారు.

 

రాము బయటికి రాగానే పరుగున వెళ్లి తనని హత్తుకుని ఏం మాట్లాడకుండా అలానే ఉండిపోయింది సీత.

 

తన హృదయ భావాలని అర్థం చేసుకుంటూనే, “నువ్వు నడిపించిన మార్గంలో నేర్చుకున్న అన్నిటిని దిగ్విజయంగా పూర్తి చేశాను రా ఇక విజయం ఆ దేవుడి పైనే ఆధారపడి ఉంది.”

 

చెప్పిన తన మాటలకి ప్రేమగా తననే చూస్తూ, “లవ్ యు రా….” మనస్ఫూర్తిగా చెప్తుంటేనే తన నోటి పై వేలేసి,

 

“ఇప్పుడు కాదు ఫలితాలు వచ్చాక చెప్పు ఇంకాస్త సంతోషిస్తా” చిరునవ్వుతో బదులిచ్చాడు రాము.

 

ఫ్యాకల్టీ ఇద్దరి పేపర్స్ ని పరిశీలిస్తూ మొత్తానికి పోటీ పరీక్షల విజేతని అనౌన్స్ చేసే టైం ఆసన్నమైంది.

 

ఇంకా ఉంది..

 

ఇంతకీ ఎవరు గెలిచారంటారు?

మన రాము గెలుస్తాడా?

ఒకవేళ గెలిస్తే గోపి పరిస్థితి ఏంటి?

రాము అతన్ని ఏం చేయనున్నాడు?

 

తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందేగా మరి..

 

అప్పటిలోపు నా కథ నచ్చితే చిన్న కామెంట్ చేసి నన్ను సపోర్ట్ చెయ్యరా.. అలాగే కథలంటే ఇష్టం ఉన్న వాళ్ళకి నా కథను షేర్ చేసి వాళ్ళ అభిప్రాయాలను ఒక చిన్ని కామెంట్ రూపంలో చెప్పమని చెప్పండి.. మీ కామెంట్స్ ఏ మా రైటర్స్ కి వచ్చే బూస్ట్ అప్ దాని ద్వారా మేము మరింత ఉత్సాహంతో కథలను రాయగలుగుతాం..

 

నన్ను సపోర్ట్ చేస్తారాని ఆశిస్తూ…

 

ఇట్లు

మీ కీర్తి💕