ఎపిసోడ్ 44
“నా చుట్టూ ఒక ఉచ్చును బిగించి, పులిబోను లోకి నెట్టేసావని నోరుజారింది స్వప్నిక. అది విన్న విజె ఏం చేస్తాడో చూద్దాం.
“ఏంటి? నేను నిన్ను పులిబోను లోకి నెట్టానా?” ఆశ్చర్యంగా అడిగాడు.
అంతె, తన తప్పు తెలుసుకుని సర్దుకుంది స్వప్నిక.
“అవును మరి, నీకూ, నాకు ఇంతకు ముందు నుండే పరిచయం ఉందని చెబితె, మీ లాస్య నన్ను చంపేస్తుంది.
మిమ్మల్ని చంపడానికి ప్రయత్నిస్తున్న వాళ్ళు నన్ను కూడా వాడుకుంటారు.” అని కోపంగా అంది స్వప్నిక.
దాంతో తలపట్టుకున్నాడు విజె.