New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
నువ్వే నాకు ప్రాణం(My Soul.. My Life) – 5

నువ్వే నాకు ప్రాణం(My Soul.. My Life) – 5

ఎపిసోడ్ 5

 

స్వప్నిక నుండి తన కాలర్ ని మెల్లిగా విడిపించుకుని లేచిన అతనికి ఎందుకో ఆమెను వదిలిపెట్టాలని అనిపించక అక్కడ డాక్టర్ కోసం ఎదురుచూస్తూ కూర్చున్న  అతని కళ్ళు ఆమెను తడముతూ ఉన్నాయి.

 

ఉదయం ఆమె కట్టుకున్న లైట్ ఆరెంజ్ కలర్ చీరలో తెల్లని ఆమె ఒళ్ళు మెరిసి పోతూ, ఆ సన్నని చీరలో నుండి ఒంటి ఒంపుసొంపులతో  క్లియర్ గా కనబడుతున్న ఆమె అందాలను బ్రహ్మ దేవుడు 

 

చాలా శ్రద్ధగా ఆమెను మలిచాడేమో. మిస్ యూనివర్స్ లెవల్లో ఖచ్చితమైన కొలతలతో ఉన్న స్వప్నిక,. శాపవశాత్తు ఇంద్రలోకం నుండి తప్పిపోయి వచ్చిన దేవకన్యలా ఉందని అనుకున్నాడతను. 

 

తన ఆలోచనలకు తనను తాను తిట్టుకుంటూ, ఎన్నడూ లేనిది ఈ అమ్మయి వల్ల పిచ్చి ఆలోచనలు వస్తున్నాయని తల విదుల్చుకున్న అతని ఫోన్ రింగయ్యింది.

 

స్క్రీన్ మీద పేరు చూసి వెంటనే లిఫ్ట్ చేసీ.

“హేయ్, ఇంకా , ఎంతసేపు? తొందరగా రా,” అని చిరాగ్గా అరిచాడు.

 

ఆ అరుపులకు స్వప్నిక మత్తుగా కదలగా,

అది చూసిన అతను “ఓ షిట్” అని అంటూ 

 

“ఒన్ సెకన్, నువ్వు, హోటల్ దగ్గరికి వెళ్ళకు..హాస్పిటల్ కి రా” అని తను ఉన్న హాస్పెటల్ అడ్రస్ చెబుతాడు.

 

అటునుండి కంగారుగా

“ఏంటి హాస్పెటలా, నువ్వు బానే ఉన్నావా?ఆర్ ఆల్ రైట్,”  అని అనడంతో,

 

“అబ్బా, నాకేం కాలేదురా, అదో పెద్ద కథ. నువ్వయితే రారా” అని చిరాగ్గా ఫోన్ పెట్టేస్తాడు అతను.

 

 

ఇంతలో అతని దృష్టి స్వప్నిక పైన పడగా, ఇంతకు ముందు ఆమె కదలడంతో స్వప్నిక పైట జరిగి ఆమె క్లివేజ్ అతని కంట పడడంతో, 

 

వెంటనే అతను, స్వప్నిక పైట సరి చేయడానికి కొంచెం వెనుకా ముందు అవుతూ, చివరకు తన వణుకుతున్న చేతులతో సారీ పైటను సరిచేయాలని చూస్తాడు..

 

 

పైటను మెల్లిగా పైకి లాగుతూ  ఉంటె అతని మునివేళ్ళు ఆమె మెడ వంపులో తాకగానే ఝళ్ళమంటూ కరెంటు షాక్ కొట్టొనట్టు అనిపించి తిరిగి ఛైర్ దగ్గరికి వెళ్ళబోగా, స్వప్నిక అతని చేయి పట్టుకోవడంతో వెనక్కి తిరిగి చూసాడు.

 

 

“అరేయ్, బావా, నువ్వేంట్రా ఇక్కడ? ఇలా” అని కంగారుగా వినపడ్డ మాటలకు అతను ముఖం ఎత్తి చూసాడు.

 

 

“హేయ్, ఆగరా, మహీ.. కొంపలంటుకుపోయేలా ఆ రంకెలేంట్రా? యూ ఆర్ టూ లేట్. నాకు ఇక్కడ చిరాగ్గా ఉంది. తొందరగా వెళదాం పదా” అని అన్నాడు అతను.

 

అక్కడ బెడ్ పైన  పడుకుని ఉన్న స్వప్నికను చూసిన మహి ఆశ్చర్యపోయాడు.

 

“ఏరా, ఏకంగా పెళ్ళిచేసుకుని వచ్చావన్న మాట” అని అన్నాడు మహి.

 

“నీ బొంద, పెళ్ళా పాడా, నాకు పెళ్ళంటే చిరాకని నీకు తెలుసు కదా.” అని విసుగ్గా ముఖం పెట్టాడు అతను.

 

 

దాంతో మహీ అయోమయంగా చూస్తూ

“మరి ఈ అమ్మాయి?” అని అడిగిన అతనికి అసలు విషయం చెప్పగానే మహీ ఓహో అని తలూపుతూ,

 

“ఏమైనా బావా,  అమ్మాయి మాత్రం మోడ్రన్ రతీ దేవిలా ఉందిరా, ఇక నువ్వూ” అని ఇంకా ఏదో అనబోయి అతని ముఖం చూసి ఆగిపోయాడు మహి.

 

 

ఆ మాటలు విన్న అతను విసుగ్గా చూస్తూ,.

“ఉంటే ఉందిగాని, నన్ను మాత్రం మోడ్రన్ మన్మధున్ని చేయకు” అని సీరియస్ గా అంటూ ఉండగా,ఇంతలో అక్కడికి  డాక్టర్ వచ్చీ, 

 

“ఇంకో అరగంటలో ఆమె స్పృహ లోకి వస్తుంది” అని అన్నాడు.

 

 

దాంతో సరేనని ఆ రూమ్ నుండి కదలబోయి ఆగిపోయిన అతను, ఎందుకో ఒక్కసారి తలెత్తి స్వప్నికను చూడగా,

 

 ఇంతకు ముందు తన మెడ వంపులో తాకిన ఆమె పెదవుల స్పర్ష గుర్తొచ్చి అక్కడ చేత్తో ఒకసారి తడుముకుని బయట పడ్డాడు.

 

 

  హాస్పెటల్ బిల్ పే చేసి, మిగితా ఫార్మాల్టీస్ కంప్లీట్ చేసుకుని అక్కడి నుండి వెళ్ళిపోయా ఇద్దరు. 

 

 

ఒక అరగంట తరువాత స్వప్నిక స్పృహ లోకి వచ్చి తనెక్కడున్నానో అర్థం కాక ఎదురుగా ఉన్న అతన్ని చూసి ఒక్కసారి భయంతో కళ్ళు తెరిచింది.

 

 

హాయ్ మేమ్, కూల్ డౌన్‌. మీరేం  భయపడకండి. మీరు హాస్పిటల్ లో ఉన్నారు” అని డాక్టర్ చెప్పగా, అప్పుడు ఆమె కళ్ళు నెమ్మదిగా ఎదురుగా ఉన్న పరిసరాలని గుర్తించాయి. అతను ఒక డాక్టర్ అని గుర్తు పట్టిన స్వప్నిక,

 

“అవును నేను ఇక్కడికి ఎలా వచ్చాను” అని అయోమయంగా అడిగింది స్వప్నిక.

 

 

ఆమె మాటలకు డాక్టర్,

 

“ఏం లేదు మేడం, చిన్న యాక్సిడెంట్. కారు డోర్  తాకి స్పృహ తప్పి కింద పడిపోయారు. అప్పుడు మీ హస్బెండ్,”  ఇంకా ఆ డాక్టర్ ఏదో చెప్పబోగా,.

 

ఆ మాటలు విన్న స్వప్నిక కోపంగా మధ్యలోనే అతన్ని ఆపీ,

 

“హౌ డేర్ యూ? హస్బెండా, వాడెవడు? అసలు మీకు కామన్సెన్స్ ఉందా?” అని కోపంగా అడిగింది స్వప్నిక.

 

 

“ఓ సారీ మేమ్. ఏదో అలవాటులో పొరపాటు. ఆ కారతను ఇక్కడ అడ్మిట్ చేసి వెళ్ళిపోయాడు.” అని వినయంగా చెప్పిన ఆ డాక్టర్ వైపు ఇంకా కోపంగా చూస్తూ,

 

“ఏంటి, ఇక్కడ నన్ను అడ్మిట్ చేసి చేతులు దులుపుకున్నాడా? ఉండండి, వాడి సంగతీ, మీ సంగతీ ఇప్పుడే తేలుస్తా” అని అంది స్వప్నిక.

 

 

దానికి  భయపడిన అతను,

 

“అమ్మా, తల్లీ, దయచేసి ఊరుకోమ్మా, బిల్లూ గట్రా అన్నీ అతనే కట్టి వెళ్ళిపోయాడు” అని చెప్పిన డాక్టర్ ని సీరియస్గా చూస్తూ,

 

“అంటే, మీ హాస్పెటల్ బిల్లు కడితే చాలా?” అని ఇంకా ఏదో అనబోయిన స్వప్నికతో,

 

 

“అమ్మా, అనుకోకుండా తెలియక యాక్సిడెంట్ చేసి, చావకపోతే ఎక్కడ కేసవుతుందోనని భయంతో, తెలిసి మరీ బతికిన వాణ్ణి చంపుతున్న మనుషులు ఉన్నారు. అలాంటిది అతను నీకు ట్రీట్మెంట్ ఇప్పించి మరీ వెళ్ళాడు. ఇక ఆపెయ్ తల్లి.” అని చెప్పాడు డాక్టర్.

 

 

తరువాత ఒక రెండు రోజులు కొరకు ట్యాబ్లేట్స్ రాసిచ్చిన తర్వాత. స్వప్నిక హ్యాండ్ బ్యాగు, మొబైల్ కోసం చూసింది. అవి అక్కడ లేవు. ఇప్పుడెలా అని ఆలోచించీ, 

 

“ఒకసారి మీ సెల్ ఫోన్ తో నాకు క్యాబ్ బుక్ చేయండి సర్. నేను వెళ్ళాలి. నాకు చాలా అర్జెంట్ వర్క్ ఉంది ప్లీజ్” అని అంది స్వప్నిక.

 

 

ఆ డాక్టర్ తన మొబైల్ తో క్యాబ్ బుక్ చేయగానే,

 

“డాక్టర్, మిమ్మల్ని ఒక మాటటడగాలి.” అని ఇబ్బందిగా ముఖం పెట్టింన స్వప్నిక, తనని ఏమడుగుతుందో ఊహించీ వెంటనే తన జేబు నుండి ఒక వెయ్యి రూపాయలు తీసి ఆమెకు ఇచ్చాడు డాక్టర్. 

 

 

“థ్యాంక్యూ డాక్టర్, యాక్చువల్లీ, నేనూ..” అని తను పని చేసే ఆఫిస్ గురించి చెప్పడానికి ట్రై చేస్తున్న ఆమెతో, 

 

 

“నో..నో..మిస్  అవన్నీ వద్దు.. ఐ..ఐ.. అండర్ స్టాండ్.” తను ఆమెను పూర్తిగా నమ్ముతానని అన్నాడు ఆ డాక్టర్.

 

ఇంతకీ వొచ్చిన అబ్బాయి ఎవరు? మళ్ళీ ఎలా ఎదురవుతారు.. తరువాతి ఎపిసోడ్ చదవండి..

దయచేసి కామెంట్స్ పెట్టి రేటింగ్స్‌ ఇవ్వండి.. థ్యాంక్యూ

(ఇంకాఉంది)