ఎపిసోడ్ 58
తన పేరున పెద్ద మొత్తంలో షేర్స్ కొని లాస్య ముందు తను గెలిచేలా సపోర్ట్ చేసిన విజెను చుసి అయోమయంలో పడిపోయింది స్వప్నిక.
తరువాత ఏమయిందో చూద్దాం.
అందరూ కంగ్రాట్స్ చెబుతుంటే ప్రతి ఒక్కరికి పదకొండు గంటలకు జరిగే సత్యనారాయణ స్వామి పూజకు రావలిసిందిగా పేరు పేరున అందరికి చెప్పారు.
ఇంతలో విజెకు ఏదో ఫోన్ రాగా మాట్లడుతూ తన క్యాబిన్ లోకి వెళ్ళిపోయాడు.
అటూ ఇటూ తిరుగుతూ ఫోన్ మాట్లాడుతూ అద్దాల నుండి కనబడుతున్న విజెను అలాగే చూడసాగింది స్వప్నిక.