పరవశం – 12
వాళ్ళ నాన్న జగదీష్ గారి గదికి వెళ్ళిన విక్రమ్, ఆయన ఎదురుగా చైర్లో కూర్చుంటాడు..
జగదీష్ గారు విక్రమ్ వైపు చూస్తూ ఉంటారు.. జగదీష్ గారి భార్య సులోచన గారు చనిపోయిన తరువాత విక్రమ్ చాలా డల్‌గా ఉండేవాడు..
ఏదో కోల్పోయాను అన్నట్లు ఉండేవాడు.. చాలాసార్లు అడిగినా ఎలాంటి సమాధానం ఉండేది కాదు..
తల్లి దూరం అయినందుకే అలా అయ్యాడు అని అనుకునేవారు జగదీష్ గారు..
ఆయనకి కూడా భార్య అంటే చాలా ఇష్టం.. ఆవిడ లోకం విడిచి వెళ్ళిపోయిన తరువాత కోలుకోవడానికి కూడా చాలా టైమ్ పట్టింది..