పెళ్లి చూపులు-16
మహాలక్ష్మి వైష్ణవ్ వైపు చూసి థాంక్స్ అని మనస్ఫూర్తిగా చెప్పి నవ్వింది.
మహాలక్ష్మి అతని వైపు చూస్తున్న వైష్ణవ్ మాత్రం ఆమె వైపు చూడలేక చాలా ఇబ్బందిగా కష్టంగా ఫీల్ అవుతున్నాడు.
అది ఆమె మీద తన మనసులో కలుగుతున్న ప్రేమ కారణంగానో మరేదో తెలియదు కానీ ఆమె వైపు చూడలేక కష్టపడి పోతున్నాడు, చూడాలి అంటే తన మనసు అదుపు తప్పిపోతుంది ఏమో అనే భయం కావచ్చు..
ఆమె కళ్ళల్లో కనిపిస్తున్న భావన తన మనసుని ఇట్టే కట్టిపడేస్తూ ఉండటంతో ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నాడు వైష్ణవ్
ఇదిగో నెంబర్ 50 అని కల్పన వైష్ణవ్ ని పిలిచింది..
వైష్ణవ్ ఉలికిపడి అంతకుమించే ఇబ్బందిగా కల్పనా వైపు తిరిగి చూశాడు.