పెళ్లి చూపులు -32
కింద నుండి వరూధిని వైష్ణవ్ అని పిలవడంతో “హ అమ్మ వస్తున్నాను” అంటూ కిందకు వెళ్లిపోయాడు వైష్ణవ్..
“ఏంట్రా వచ్చిన దగ్గరనుంచి ఏదో పోగొట్టుకున్న వాడిలా అలా తిరుగుతున్నావ్?” అని అడిగింది వరూధిని
“అది ఏం లేదమ్మా ఆఫీస్ గురించి ఆలోచిస్తున్నాను” అని అప్పటికి తప్పించుకున్నాడు..
ఆఫీస్ అని చెప్పేసరికి వరూధిని కూడా ఇక ఏమీ మాట్లాడలేదు “సర్లేరా ఈరోజు నీకు ఇష్టమైన సాంబార్ చేశాను.. కూర్చో తిందువు” అని చెప్పటంతో “సరే అమ్మ” అంటూ తన తల్లి వడ్డిస్తుంటే ఈ ఇష్టంగా తిన్నాడు వైష్ణవ్..
వైష్ణవ్ బాధ అర్థమవుతున్న విజయేంద్ర మాత్రం మూసి మూసిగా నవ్వుకుంటూ ఉన్నారు.