పెళ్లి చూపులు -40
థాంక్యూ అని చెప్పి తన పాకెట్లో వేసుకుంది సిరి.
వైష్ణవ్ సిరి వైపే నవ్వుతూ చూస్తూ ముందుకు నడుస్తున్నాడు.
అది గమనించిన సిరి “హలో మాస్టరు నువ్వు నా వైపు ఇలా నవ్వుతూ చూస్తూ నడుస్తుంటే బాగానే ఉంటుంది నీకు. కానీ ముందు ఏముందో చూడకపోతే బొక్క బోర్లా పడతావ్. కాబట్టి నీ చూపు ముందు రోడ్డు మీద, నీ వైపు వచ్చే జనాలకి డాష్ ఇవ్వకుండా పక్కకు తప్పుకోవాలి అని మైండ్ తో నువ్వు నడిస్తే బస్టేమో” అని సర్కస్టిగ్ అన్నది..
అప్పటివరకు ఆమె వైపు నవ్వుతూ చూస్తున్న వాడు కాస్త ఒక్కసారిగా తన ఫేసులో నవ్వు మాయమై ఏంటి సిరి అలా మాట్లాడితావ్ అని అన్నాడు.
“నిజాలు ఎప్పుడు ఇలానే ఉంటాయి నెంబర్ 50” అని వెటకారంగా అన్నది సిరి..