పెళ్లి చూపులు -41
“నిజమేరా బాబాయ్ ఫెవికాలా అతుక్కునేటట్లు ఉంది” అని అంటూ వైష్ణవ్ తన ప్లేసులో కూర్చున్నాడు..
తనతో మాట్లాడుతున్న వైష్ణవ్ ని సిరి పిలవడంతో కోపంగా సిరి వైపు చూస్తూ ఇక చేసేది ఏమీ లేక కాలిని నేలతో తన్నుకుంటూ గౌతమి తన ప్లేసులోకి వెళ్లి కూర్చుంది.
అవసరం ఉన్నా లేకపోయినా కూడా గౌతమి డౌట్స్ అంటూ వైష్ణవ్ దగ్గరకు రావడంతో వైష్ణవ్ కి చాలా అసహనంగా అనిపించింది. కానీ ఆమెను ఎవాయిడ్ చేయలేక అలాగానే ఆ డౌట్స్ క్లారిఫై చేయకుండా వదిలేయలేక ఏం చేయాలో అర్థం కానప్పుడు, తన పక్కనే కూర్చున్న రవి కనిపించడంతో రవి కొంచెం గౌతమికి ఈ డౌట్స్ క్లారిఫై చేయవా నాకు అర్జెంట్ వర్క్ ఉంది అని గౌతమిని రవికి అప్పగించాడు.
ఓకే వైష్ణవ్ అనే చెప్పి గౌతమి అడిగినా డౌట్ ని రవి క్లారిఫై చేస్తుంటే,
గౌతమి అదేమీ వినకుండా వైష్ణవ్ వైపు చూస్తూ ఉంది.
వింటున్నావా గౌతమి అని రవి అడిగితే వింటున్న నా డౌట్ క్లారిఫై అయిపోయిందిలే అని తన ప్లేస్ కి వెళ్లి కూర్చుంది..