New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
మహారాణా ప్రతాప్ – 6

మహారాణా ప్రతాప్ – 6

మహారాణా ప్రతాప్ : 6వ భాగం

చిత్తోర్ ఘర్ లో రతన్ సింగ్ మరియు రాణి పద్మిని దేవి మరణం తరువాత ఈ సిసోడియా రాజవంశంలో హమీర్ అనే పాలకుడు , వప్పా రావల్ వలే ధైర్య పాలకుడిగా సింహాసనాన్ని అధిష్టించాడు.

అల్లా ఉద్దిన్ ఖిల్జి ఆక్రమించిన చిత్తోర్ ఘర్ ని విదేశీ పాలన నుండి విముక్తి చెయ్యాలని కలలు కనేవాడు. మేవార్ పాలకుడు అయిన వెంటనే తన సైనిక బలాన్ని పెంచడం మొదలు పెట్టాడు. అతి తక్కువ సమయంలో సైనిక బలాన్ని పెంపొందించి చక్కటి యుద్ధ వ్యూహాలతో విజయం సాధిస్తుందనే నమ్మకంతో చిత్తోర్ ఘర్ పైకి దండయాత్రకు వెళ్ళాడు. ఆ సమయంలో ఖిల్జీ వారసుడు పరిపాలన చేస్తున్నాడు.

హమీర్ తన యుద్ధ వ్యూహం మరియు ఆత్మవిశ్వాసంతో చిత్తోర్ ఘర్ పై దండయాత్ర చేసి చిత్తోర్ ఘర్ ని తిరిగి జయించాడు. ఖిల్జీ వారసులతో పాటు తుగ్లక్ లతో అనేక సార్లు హామీర్ తన పోరాటం కొనసాగించవలసి వచ్చింది. తనకు ఎదురుగా ఉన్న ప్రతీ శత్రువుతో యుద్ధం చేయడం మొదలుపెట్టాడు హామీర్. అందరితో విజయం సాధించి తన భూభాగాన్ని విజయవంతంగా విస్తీర్ణం చేసి సమర్థవంతమైన పాలనను ఏర్పాటు చేశాడు హామీర్. అతని తరువాత తన పుత్రుడు అయిన క్షేత్ర సింగ్ , తండ్రి శౌర్యానికి తగ్గట్టుగా యుద్ద విద్యలు అభ్యసించి , రాజ్య సింహాసనాన్ని అధిష్టించి పరిపాలనను మొదలుపెట్టాడు.

1382 లో క్షేత్ర సింగ్ తర్వాత అతని కుమారుడు లఖా , చిత్తోర్ సింహాసనాన్ని అధిస్టించి వివిధ యుద్ధాలకు సంబంధించిన విజయాలతో పూర్వీకుల కీర్తిని కొనసాగించాడు. లఖా మేవార్ ప్రజల కోసం అనేక పనులు చేసాడు. ఇది ఆ కాలంలోనే రాతి శాసనాల ద్వారా నిరూపించబడింది. ఆ తర్వాత అతని కుమారుడు మోకుల్ మేవార్ సింహాసనాన్ని అధిష్టించాడు.

1428 లో నాగౌర్ , ఫిరోజ్ ఖాన్ కొద్ది కాలం పాటు పరిపాలించారు. 1433 లో మహారాణా కుంభ పాలకుడిగా మారి మేవార్ రాజ్యాన్ని మరింత బలమైన రాజ్యాంగా స్థాపించాడు. రాజ్య భద్రతను మరింత బలోపేతం చేయడానికి అనేక కోటలు నిర్మించాడు.

మహారాణా కుంభ కి బాగా ఇష్టమైనవి కళలు మరియు జ్ఞాన సంపద. అతను పండితులను ఎక్కువగా గౌరవించేవాడు. ఒక రాజు కి ఉండవలసిన అన్ని లక్షణాలను కలిగి ఉన్నాడు. ఢిల్లీ సుల్తాన్ పై దండెత్తి అనేక భాగాలను స్వాధీనం చేసుకున్నాడు. వాటిపై తన పాలనను స్థాపించాడు. అతని ధైర్యం వలన సంతోషంగా ఉన్న అక్కడి ముస్లీం సామంత రాజులు ‘కురాన్’ అన్న బిరుదు తో సత్కరించారు. ఈ గొప్ప కీర్తి కారణంగానే మేవార్ రాజపుత్ రాజుల ప్రధాన రాజ్యం గా అవతరించింది.

మహారాణా కుంభ తన పరిపాలన సమర్ధవంతంగా , ఎలాంటి శత్రువుకు తన రాజ్య సరిహద్దుల వైపు కూడా వచ్చే అవకాశం ఇచ్చేవాడు కాదు. రాజ్యం నుండి నాలుగు దిక్కులా తన గూఢచారులను నియమించి ఎప్పటికప్పుడు పొరుగు రాజ్యాల సమాచారాన్ని తెలుసుకునేవాడు.

కొన్నిసార్లు ముళ్ళ పొదలు అందమైన సారవంతమైన భూమిలో కూడా పెరుగుతాయి. ఆ ముళ్ళ పొదలు ఆ సారవంతమైన భూమిని కూడా నాశనం చేస్తాయి. సరిగ్గా మహారాణ కుంభ విషయంలో కూడా అదే జరిగింది. ఈ గొప్ప మహిమాన్వితమైన రాజును తన సొంత కుమారుడు అయినా ఉడా హత్య చేశాడు. ఉడా ఒక అసమర్థ మరియు అనాగరిక పాలకుడు అని నిర్ణయించుకున్న సామంత రాజులందరూ అతనికి శత్రువులు గా మారారు. ఆ ద్రోహాన్ని భరించలేని చాలా మంది సామంత రాజులు ఉడా యొక్క తమ్ముడు అయినా రైమల్ ని తదుపరి రాణా గా ప్రకటించారు. దీని కారణంగా , ఉడా మరియు రైమల్ మధ్య శత్రుత్వానికి దారి తీసింది.

ప్రతి ఒక్క సామంత రాజు రైమల్ కి మద్దతు ఇవ్వడం ఓర్చుకోలేని ఉడా , వారి మాటలకు అంగీకరించక తన సైన్యంతో రైమల్ పై యుద్ధానికి వచ్చాడు. ధరింపూర్ , జావి , పంగల్ మరియు చిత్తోర్ లో ఉడా ఓటమిని ఎదురుకోవలసి వచ్చింది. చివరికి 1437 లో రైమల్ మేవార్ కి రాజు గా సింహాసనాన్ని అధిష్టించాడు.

రైమల్ సమర్ధుడైన పాలకుడు. కానీ దురదృష్టవశాత్తు తన కుమారులు , సోదరుడు మరియు మేనల్లుళ్ళ వ్యతిరేకతను ఎదురుకోవలసి వచ్చింది. రాజ కుటుంబీకులలో ఐక్యత లేకపోవడం వల్ల మేవార్ యొక్క అంతర్గత పరిస్థితి దయనీయంగా మారింది. మేవార్ ఆర్థిక వ్యవస్థ పడిపోతూ వచ్చింది. అదృష్టవశాత్తూ మేవార్ ప్రతిష్ఠకు ఎలాంటి ఆటంకం కలగలేదు.

రైమల్ వారసుడు సంగ్రామ్ సింగ్ 1508 మే 4 న రాణా సంఘా గా ప్రసిద్ధి చెంది మేవార్ సింహాసనంపై కూర్చున్నాడు. సింహాసనం పై కూర్చున్న రాణా సంఘా వయస్సు 27 సంవత్సరాలు. ఇతను తన నైపుణ్యాలతో అద్భుతమైన పాలకుడిగా కీర్తిని పొందాడు.

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue