తను ఇలానే అందరితో కలిసిపోయి పరిస్థితులనీ అర్థం చేసుకొని మనుషులతో మంచిగా మసులుకుంటూ సంతోషంగా ఉండడమే కదా నాకు కూడా కావాలి అని తనలొ తను అనుకుంటాడు ప్రణయ్
ఇంట్లోకి వెళ్లిపోయిన భాను ప్రతిమకి చిన్న చిన్న పనులు చెబుతూ తనే వంట పూర్తి చేస్తుంది..ప్రతిమ కూడా శ్రద్ధగా భాను చేసే ప్రతి పనిని చూస్తూ, భాను ఏం చెప్పినా కాదు అనకుండా చేస్తుంది ..
వాళ్లు టిఫిన్ ప్రిపేర్ చేయడం పూర్తయ్యే లోపల బయటకు వెళ్లిన యశోద గారు కూడా వంటింట్లోకి వస్తారు..
అక్కడ ప్రతిమను చూసిన ఆవిడ అయ్యో ప్రతిమ నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు మా.. అప్పుడే ఈ ఇంటి కోడలు బాధ్యతలు తీసేసుకున్నావా నువ్వు అంటూ నవ్వుతారు..
ఆ మాటకు భాను తల్లి వైపు చూస్తూ మరి ఇంటి కోడలు అంటే ఆ మాత్రం బాధ్యతలు ఉండవా అమ్మ.. నీ కోడలు బాధ్యతలు నిర్వర్తించడంలో ముందే ఉంది మరి దీనికి నువ్వు సంతోషించు అంటూ నవ్వుతుంది..
హా ఈ బంగారు తల్లి విషయంలో నాకు ఎలాంటి చింతా లేదులే భాను.. నా తర్వాత ఏంటిని ఎంతో చాకచక్యంగా నడుపుతుంది అన్న నమ్మకం నాకు ఎప్పుడో కలిగింది అని తృప్తిగా చెప్తారు యశోద గారు..