ప్రతిమ అలా చెప్పినా సరే ఇంకాసేపు ఆట పట్టించాలి అని భావించిన భాను ఓ మరదలు పిల్ల నేను ప్రణయ్ గారు వచ్చాము అంటున్నావు..ఇంతకీ ఆ ప్రణయ్ గారు నీకు ఏమవుతారు అమ్మాయి అని అల్లరిగా అడుగుతుంది..
ఆమె ప్రశ్నకి ప్రతి మా బిక్క మొహం వేయగా భాను పక్కనే ఉన్న భరత్ కల్పించుకొని భార్యామణి ఏంటి మా చెల్లికి ఎవరూ లేరు అనుకున్నావా..
మా చెల్లి కనీసం తన భర్త పేరయినా చెప్పింది.. మీ తమ్ముడు ఇంకా ఆ పేరు కూడా చెప్పలేదు కానీ నువ్వేమో ప్రణయ్ గారు ఎవరు అంటూ మా చెల్లిని ఆటపట్టిస్తున్నావే..
ఇప్పటికి మా చెల్లిని ఆట పట్టించింది చాలు కానీ ముందు మీ తమ్ముడిని చెప్పమనవోయ్ అంటాడు..
అయ్యో భర్త గారు మీరు కాసేపలా ఉండండి.. మీ చెల్లికి తర్వాత వాకాళ్తా పుచ్చుకుందురు గాని, ఇప్పుడు ఈ ఇంటి ఆడపడుచు గా కాసేపైనా నా మాటలు నెగ్గనివ్వండి మహాప్రభు అని భరత్ తో చెప్పి మరదలు పిల్ల మీ అన్నయ్య మాటలకు ఏమి కానీ ముందు ఆ ప్రణయ్ గారు నీకు ఏమవుతారో చెప్పమ్మా అని ప్రతిమ వంకే సూటిగా చూస్తూ అడిగింది..
ఆమె మాటలు విన్న యశోద జనాల్లో నుండి కాస్త ముందుకు వచ్చి భాను బంగారం ఇంక చాల్లేరా పాపం ఎందుకు మీ మరదల్ని ఇబ్బంది పెడుతున్నావు..