ఆ రాత్రి వంశీకి అస్సలు నిద్ర పట్టలేదు. అందరూ పడుకున్నాక మెల్లగా లేచి మళ్ళీ డైరీ తీయాలనుకున్నాడు..
కానీ ఏదో భయం అతన్ని ఆపుతోంది. శ్రావణి గతం ఒక అగ్నిపర్వతంలా అతని ముందు ఉంది. ఆమెను కాపాడాలా? లేక ఈ నిజాన్ని ఆమెకే చెప్పాలా?
రాత్రి గంభీరంగా మారింది. గడియారం ముల్లులు చేసే శబ్దం తప్ప ఇంట్లో ఏ చప్పుడూ లేదు.
అందరూ నిద్రపోయారని నిర్ధారించుకున్నాక, వంశీ మెల్లగా తన బీరువా తెరిచాడు. పది రోజుల క్రితం తెచ్చిన ఆ పాత డైరీ ఇప్పుడు అతని చేతుల్లో నిప్పుకనకలా ఉంది.
గదిలో చిన్న లైట్ వేసుకుని, వణుకుతున్న చేతులతో శ్రావణి రాసిన ఆ ఆఖరి నిర్ణయం పేజీ తర్వాత ఏముందో చూడటానికి తిప్పాడు.