ఆదివారం కావడంతో వంశీ ఇంట్లో అందరూ రిలాక్స్‌గా ఉన్నారు. గోపాల్ గారు బాల్కనీలో పేపర్ చదువుతుంటే, సరస్వతి గారు వంటింట్లో టిఫిన్ చేస్తున్నారు. వంశీ ఇంకా నిద్రలోనే ఉన్నాడు.
రవి తన రూమ్‌లో ఏదో వెతుక్కుంటున్నాడు. అన్నయ్యా నా పెన్ డ్రైవ్ నీ బ్యాగ్‌లో పెట్టానా ఒకసారి చూడు అని అరిచాడు.
వంశీ నిద్రమత్తులో అక్కడ సోఫా మీద బ్యాగ్ ఉంది చూడు రవీ.. నాకేం తెలియదు అని బదులిచ్చి మళ్ళీ దుప్పటి ముసుగు తన్నాడు.
రవి సోఫా దగ్గరకు వెళ్లి వంశీ ల్యాప్‌టాప్ బ్యాగ్ జిప్పు తీశాడు. పెన్ డ్రైవ్ కోసం లోపల చెయ్యి పెట్టి వెతుకుతుంటే, అతనికి ఒక గరుకైన స్పర్శ తగిలింది.
ఇదేంటి ల్యాప్‌టాప్ కింద ఏదో బుక్ ఉన్నట్టుంది అనుకుంటూ దాన్ని బయటకు తీశాడు.
అది ఒక డైరీ.
పాతకాలపు లెదర్ కవర్‌తో, ఎంతో హుందాతనంగా ఉందది. రవి ఆ డైరీని చూడగానే ఒక్క క్షణం ఆగిపోయాడు.